»   » వీడియో: సుధీర్ బాబు 'భలే మంచిరోజు' టీజర్

వీడియో: సుధీర్ బాబు 'భలే మంచిరోజు' టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సుధీర్‌ బాబు హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భలే మంచిరోజు'. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై విజయ్‌, శశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ని నిర్మాతలు విడుదల చేసారు. ఈ టీజర్ చాలా ఆసక్తిగా సాగింది. మీరూ ఓ లుక్కేయండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'ప్రేమ కథా చిత్రం', సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది.


70ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజరు కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ ఆధిత్యని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఉత్తమ విలన్‌', 'విశ్వరూపం2' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. సన్ని.ఎమ్‌.ఆర్‌ ఈ చిత్రానికి బాణీలు అందించారు.


Sudheer Babu's BHALE MANCHI ROJU TEASER

నిర్మాతలు మాట్లాడుతూ '' ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సబ్జెక్ట్‌ అనుకున్నట్టుగానే తెరకెక్కించాం. సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. కథ, కథనాలని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధీర్‌ బాబు పరకాయ ప్రవేశంలా ఇన్‌వాల్వ్‌ అయ్యి మరీ నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.


కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌. ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, పి.ఆర్‌.వో- ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్- శ్రీరామ్‌ రెడ్డి, నిర్మాత‌లు-విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌.

English summary
Bhale Manchi Roju is a Telugu Feature Film Produced by Vijay Kumar Reddy and Shashidhar Reddy under the banner of 70mm Entertainments starring Sudheer Babu and Wamiqa, Directed by Sriram Adittya, Music by Sunny M.R. and Cinematography by Shamdat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu