twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాత టైటిల్...కొత్త కథ (‘మోసగాళ్లకు మోసగాడు’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు' చిత్రం సంచలనం. ఇప్పుడు ఇదే టైటిల్ తో ఆయన అల్లుడు హీరోగా చిత్రం రెడీ అయ్యి ఈరోజు రిలీజ్ అవుతోందంటే ఆయన అభిమానలకు, మహేష్ అభిమానులకు ఆనందమే. దానికి తోడు ఫస్ట్ లుక్...ట్రైలర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేయటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి వాటిని ఎంతవరకూ రీచ్ అవుతారనేది కీలకం. వరస పరాజయాల్లో ఉన్న సుధీర్ బాబు కు సైతం ఈ చిత్రం విజయం చాలా కీలకం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా చిన్న చిన్న మోసాలు చేసి బ్రతికే చలాకీ యువకుడు క్రిష్ (సుధీర్ బాబు) . తన తెలివితేటలతో ఎదుటి వారిని మోసం చేస్తూ సరదాగా జీవితాన్ని గడిపుతూ...ఎలాంటి గోల్ లేకుండా బ్రతికే అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ పెద్ద లక్ష్యం వచ్చి చేరుతుంది. అనుకోకుండా వచ్చిన ఓ సమస్య నుంచి బయటపడటానికి అతనికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. దాని కోసం అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులేమిటన్నదే చిత్ర ఇతివృత్తం. అదేమిటి? 12 శతాబ్దానికి చెందిన సీతారాముల విగ్రహాలతో అతనికి ఉన్న సంబంధమేమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

    Mosagallaku Mosagadu

    దర్శకుడు మాట్లాడుతూ... ‘పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరిస్తుందనే నమ్మకముంది.
    ఇదొక కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్. సుధీర్ బాబు పాత్రలో పక్కా మాస్‌గా అనిపించినా స్టైలిష్‌గా వుంటుంది. హాలీవుడ్ సినిమాల మాదిరిగా డైలాగ్స్ తక్కువగా వుంటాయి.' అని తెలిపారు.

    సుధీర్ బాబు మాట్లాడుతూ... పోకిరిలో మహేష్‌బాబు తరహాలో నా పాత్ర పవర్‌ఫుల్‌గా వుంటుంది. ఎక్కడా అతిశయాలు లేకుండా ప్రతి సన్నివేశం సహజంగా వుంటుంది. స్టైలిష్ మాస్ క్యారెక్టర్ చేయాలంటే ఏ నటుడికైనా చాలా ధైర్యం కావాలి. భావించి ఈ సినిమా చేశాను అంటున్నారు సుధీర్ బాబు.

    టైటిల్ గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ.... తెలుగు సినిమాలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికిని గొప్ప చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఆ రోజుల్లోనే వందదేశాల్లో ఆడి రికార్డు సృష్టించింది. అయితే ఈతరం వారికి ఆ సినిమా ఘనత ఏమిటో తెలియదు. ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు. ఈ సినిమాలో నా గెటప్ చాలా బాగుందని మావయ్య మెచ్చుకున్నారు. రెండు సినిమాల టైటిల్ డిజైన్ ఒకటేనని గుర్తుచేశారు అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ‘కథ,కథనాలు వినూత్న తరహాలో సాగుతాయి. మణికాంత్ ఖాద్రి అందించిన స్వరాలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రేమ, వినోదం, యాక్షన్, ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించి దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకముంది' అని అన్నారు.

    బ్యానర్ :లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్

    నటీనటులు : సుధీర్ బాబు, నందిని, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు
    సంగీతం: మణికాంత్ ఖాద్రి,
    ఆర్ట్: నాగేంద్ర,
    మాటలు: ప్రసాద్‌వర్మ పెన్మత్స, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,
    పాటలు: శ్రీమణి, కె.కె,
    సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్,
    అసోసియేట్ ప్రొడ్యూసర్: సతీష్ వేగేశ్న.
    నిర్మాత :చక్రి చిగురుపాటి
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోస్ నెల్లూరి
    విడుదల తేదీ :22, మే 2015.

    English summary
    Sudher Babu, Nandini Roy's ‘Mosgallaku Mosgadu’ is getting ready to hit the screens today. The film titled is matched with Superstar Krishna’s memorable movie ‘Mosagallaku Mosagadu’ released in 1971 is a trendsetter in Telugu. The film is directed by Bose Nelluri and produced by Chakri Chigurupati. Actress Nandini is pairing up with Sudheer Babu.The music is scored by Manikanth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X