»   » వెల్కమ్ టు టాలీవుడ్ శ్రద్దా: ఎంత చక్కగా ఆహ్వానం చెప్పాడో

వెల్కమ్ టు టాలీవుడ్ శ్రద్దా: ఎంత చక్కగా ఆహ్వానం చెప్పాడో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎట్టకేలకు ప్రభాస్ ప్రభాస్ సాహో షూటింగ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో 5 కోట్లతో నిర్మించిన ఓ భారీ సెట్ లో సన్నివేశాల్ని చిత్రీకరించాడానికిి రెడీ అయ్యాడు దర్శకుడు సుజిత్. ప్రభాస్ కూడా ఈ సెట్ లో నిర్విరామంగా కొన్ని రోజుల పాటు షూటింగ్ లో బిజీగా గడపనున్నాడట.

 ఫుల్ యాక్షన్ తరహా చిత్రం

ఫుల్ యాక్షన్ తరహా చిత్రం

ఐదేళ్ల వరకు ఫుల్ గా బాహుబలి మూడ్ లో ఉన్న ప్రభాస్ ఈ సారి ఫుల్ యాక్షన్ తరహా చిత్రంతో రాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఫేస్ బుక్ లో ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిట్ చేస్తున్నాడిప్పుడు.దాదాపు 150 కోట్లతో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Prabhas' Saaho Heroine Finally Confirmed
ప్రభాస్ కు జోడిగా ఫిక్స్ చేశారు

ప్రభాస్ కు జోడిగా ఫిక్స్ చేశారు

ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని కూడా ప్రభాస్ కు జోడిగా ఫిక్స్ చేశారు. తాజాగా ఆమె ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు.

వెల్‌కమ్ చెప్తూ పోస్టులు పెట్టారు

వెల్‌కమ్ చెప్తూ పోస్టులు పెట్టారు

ఇందులో నుండి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌లకు రెమ్యూనరేషన్ భారీగా అందుతున్నట్లు సమాచారం.దీంతో తెలుగు ప్రేక్షకులు.. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శ్రద్ధాకపూర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్తూ పోస్టులు పెట్టారు. అభిమానులు చెప్పిన ఈ వెల్‌కమ్‌కి శ్రద్ధా ఉబ్బితబ్బిబ్బవుతోందట.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో

తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ అవుతుండటమే తనకు లభించిన వరంగా ఆమె ఫీలవుతుంటే అభిమానుల అభిమానంతో శ్రద్ధా మరింత ఆనందానికి లోనవుతోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇదిలా వుంటే హీరో సుధీర్ బాబు శ్రద్ధాకు టాలీవుడ్‌లోకి వెల్‌కమ్ చెప్తూ ట్వీట్ చేశారు. ఈ యంగ్ హీరో గతంలో శ్రద్ధాకపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌ జంటగా నటించిన భాగీ సినిమాలో విలన్‌గా నటించాడు.

English summary
All the best ShraddhaKapoor Entering Tollywood with the right team. Tweets Sudheer Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu