మహేష్‌తోనా... రూమరే అని కొట్టిపారేసాడు
హైదరాబాద్: రెండు రోజులుగా దర్శకుడు శ్రీనువైట్లతో సుధీర్ బాబు ఓ సినిమా చేయనున్నారనే మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ నిర్మించనున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇవన్నీ కేవలం రూమర్సే అని సుధీర్ బాబు కొట్టిపారేసాడు.
దర్శకుడు శ్రీనువైట్లతో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు, ఆ సినిమాను మహేష్ నిర్మించబోతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అది రూమర్ అని స్పష్టం చేశారు.

అలాగే ఈ కాంబినేషన్ వినడానికి బాగున్నా, అలాంటి డిస్కషన్ ఇప్పటివరకూ రాలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తన తదుపరి సినిమా ఏదనేది ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ఆ విషయం వెల్లడిస్తానని సుధీర్ ఈ ట్వీట్ లలో పేర్కొన్నారు.

మహేష్ బాబు తన బావ అయిన సుధీర్ బాబుకు తొలి నుంచీ అండగా ఉండటమే ఈ రూమర్స్ కు తావిచ్చింది అని తెలుస్తోంది. రీసెంట్ గా ‘భలే మంచి రోజు' తో హిట్ కొట్టిన సుధీర్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏదీ ఇంకా ఖరారు కాలేదు.


Click it and Unblock the Notifications











