For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి వెపన్స్ పై అల్లరి నరేష్ విసుర్లు

  By Srikanya
  |

  హైదరాబాద్: రాజమౌళి చిత్రాలన్నిటిలోనూ హీరోకి ప్రతీసారి ఓ కొత్త తరహా ఆయుధాన్ని ఇస్తూండటం మనికి తలెసిందే. రాజమౌళి ప్రత్యేకంగా డిజైన్ చేసే ఆ వెపన్స్ పై అల్లరి నరేష్ విసుర్లు విసరబోతున్నాడు. అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడులో భీమినేని శ్రీనివాసరావు ఈ ఆయుధాలపై కామెడీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఓ పోస్టర్ సైతం వదిలారు. ఆ పోస్టర్ లో ...రాజమౌళి సినిమాల్లో హీరోలు వాడిన ఆయుధాల్ని వేసి,మరో ప్రక్క అల్లరి నరేష్ వాటికి భిన్నంగా...అరటిపండు తొక్క,టీవి,ల్యాప్ టాప్, వేళ్లు ని వాడుతున్నట్లు గా చూపించారు. అయితే ఈ పోస్టర్ చూసిన వారు నవ్వుకోవటాకి బాగానే ఉన్నా సినిమా అటూ ఇటూ అయితే నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుంది అంటున్నారు.

  అల్లరి నరేష్‌, మోనాల్‌ గజ్జర్‌ జంటగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెంగళూరులోని లెనిన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అధినేత చంద్రశేఖర్‌ డి.రెడ్డి రూపొందించిన పూర్తి వినోదాత్మక చిత్రం 'సుడిగాడు'. ఈ నెల 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్య కేంద్రాలలో విడుదల కాబోతోంది. ఇప్పటివే విడుదలైన పాటలు, ట్రైలర్లు, వినూత్నరీతిలో పోస్టర్లు ప్రతి ఒక్కరిచే ప్రశంసలు అందుకుంటున్నాయి.

  అల్లరి నరేష్ మాట్లాడుతూ...మహేష్‌బాబు కాదు కానీ పోకిరి రేంజ్‌లో పంచ్‌ డైలాగులు చెబుతాడు... రోబోలో రజనీకాంత్‌లా వంద తుపాకులు ఒకేసారి పేల్చేస్తాడు... భారతీయుడిలో కమల్‌హాసన్‌లా మర్మకళ ప్రదర్శిస్తాడు... మిత్రవింద కోసం మగధీరుడి అవతారమెత్తుతాడు. ఇన్ని విషయాలు తెలిసిన ఓ కుర్రాడి చుట్టూ తిరిగే కథే మా చిత్రం అన్నారు నరేష్‌. తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలో నే విడుదల చేస్తారు.

  'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు. 'సుడిగాడు'ట్రైలర్స్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్ తో ఓవర్ సీస్ బిజినెస్ లో అల్లరి నరేష్ కెరీర్ లో ఇంతవరకూ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. నలభై ఐదు లక్షలకు ఈ చిత్రాన్ని అమ్మినట్లు సమాచారం. అదే విధంగా ఆంధ్రాలోని ఏరియా వైజ్ బిజనెస్ కూడా మంచి రేటు పలుకుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్,వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరక్ట్ చేసిన బీమినేని తొలిసారిగా అల్లరి నరేష్ ని డైరక్ట్ చేసి బిజినెస్ కు హైప్ తెచ్చారు. చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు, కోవై సరళ, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్‌. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత.

  English summary
  The publicity campaign of Sudigadu is also innovative and humorous. The film has created huge interest with its funny trailer. Trade pundits are hopeful that it would take in great openings this weekend. All eyes on are Allari Naresh's Sudigadu that is releasing this weekend (August 24). 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X