»   »  వీటిలో ఏది బెస్ట్ టైటిల్...చెప్తే హీరోని కలవొచ్చు

వీటిలో ఏది బెస్ట్ టైటిల్...చెప్తే హీరోని కలవొచ్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో సందీప్ కిషన్ రీసెంట్ గా ఓ మళయాళ చిత్రం రీమేక్ కమిటయ్యారు. ఆ చిత్రం మరేదో కాదు నేరమ్. దాదాపుగా షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రానికి టైటిల్ పెట్టడానికి ఆ మధ్యన సందీప్ కిషన్ తన అభిమానులను టైటిల్ సూచించమంటూ ఓ వీడియో వదిలాడు. వారు కొన్ని టైటిల్స్ సూచించారు.

Suggest the best title for Sundeep Kishan

అందులో తనకు నచ్చినవి ఎంపిక చేసి...వాటిలో ఒకటి మీరే ఎంపిక చేయమంటూ మళ్లీ ఫ్యాన్స్ ముందు పెట్టాడు. ఇలా ఫ్యాన్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రమోషన్ చేస్తున్నాడన్నమాట. ఇంతకీ ఆ టైటిల్స్ ఏమిటో...ఆయన ట్వీట్ ద్వారా తెలుసుకోండి.

2013లో చాలా చిన్న సినిమాగా వచ్చితమిళం, మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ‘నేరం'. నేరమ్ చిత్రం తమిళ,మయాళ భాషల్లో ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదొక డార్క్ కామెడీ చిత్రం. నాగ చైతన్య చేస్తున్న రీమేక్... ఒరిజనల్ ప్రేమమ్ చిత్రం దర్శకుడు తొలి చిత్రం ఇది. ఈ చిత్రంతోనే అతనికి మంచి పేరు వచ్చింది. నజ్రియా నసీమ్, నవీన్ పోలి ఈ సినిమాలో చేసారు.


గతంలో మిస్టర్ నోకియా చిత్రం మంచు మనోజ్ చేసిన దర్శకుడు అనీల్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నారు. నేరం అంటే టైం అని అర్దం. గతంలో ఈ చిత్రాన్ని దాసరి గారు తన కుమారుడు అరుణ్ కుమార్ తో చేద్దామనుకున్నారు. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఇక ఈ చిత్రాన్ని ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.

English summary
Check the above image for the list of titles that are shortlisted by AK Entertainments team. Those,who suggested the better title, will get a chance to meet the cast and crew on February 14.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu