»   » షాకింగ్...దర్శకుడు త్రివిక్రమ్ ఆత్మహత్య ఆలోచన!

షాకింగ్...దర్శకుడు త్రివిక్రమ్ ఆత్మహత్య ఆలోచన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. ఇటీవల 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందు పైరసీకి గురి కావడంతో త్రివిక్రమ్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ... విడుదలకు ముందు 'అత్తారింటికి దారేది' పైరసీ సీడీలు బయటకు రావడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాను. తాను ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా విషయంలో ఇలా జరుగడం తనను ఎంతగానో బాధించింది' అని వెల్లడించారు.

సినిమా విడుదల అయిన తర్వాత వస్తున్న స్పందన...పైరసీ పెయిన్ నుంచి విముక్తి కలిగించింది. పైరసీని అరికట్టడంలో సైబర్ క్రైం విభాగం వారు సమర్థ వంతంగా పని చేసారు. పైరసీ కేసును రెండు మూడు రోజుల్లోనే చేదించారు. మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పైరసీ సీడీలను అడ్డుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారని త్రివిక్రమ్ ప్రశంసించారు.

కాగా...పైరసీ వ్యవహారంతో నిర్మాతను గట్టెక్కించేందుకు పవన్, త్రివిక్రమ్ తమ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై త్రివిక్రమ్ స్పందించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Talking in a TV channel Attarintiki Daredi director Trivikram Srinivas shared his happiness and explained the hardships of the makers.He spoke about piracy and said that suicide will be only option if things goes wrong .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu