»   » నటి ఆల్ఫోన్సా నా భర్తను కిడ్నాప్ చేసింది: మహిళ ఆరోపణ

నటి ఆల్ఫోన్సా నా భర్తను కిడ్నాప్ చేసింది: మహిళ ఆరోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినీ నటి అల్ఫోన్సా మరోసారి వార్తల్లోకి వచ్చింది. అల్ఫోన్సా తన భర్తను అపహరించిందని ఆరోపిస్తూ తమిళనాడు రాజధాని చెన్నైలోని మైలాడుదురైకి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ మహిళ బుధవారంనాడు చెన్నై నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌ను కలిసి అల్ఫోన్సాపై ఫిర్యాదు చేసింది. పలు చిత్రాల్లో శృంగారాన్ని ఒలకబోసిన అల్ఫోన్సా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను కూడా పోషించింది.

Sujatha complains against actress alphonsa

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భాష చిత్రలో రా... రా... రా.... రామయ్య పాట ద్వారా ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది. అల్ఫోన్సా తన భర్తను కిడ్నాప్ చేసిందంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనానికి కారణైంది.

చెన్నైలోని సదాశివ పేటలో నివసిస్తున్న తభర్త జయశంకర్‌ను అల్ఫోన్సా అపహరించిందని, ప్రస్తుతం ఆమె తనను చంపుతానని ఫోన్‌లో బెదిరిస్తోందని సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

Sujatha complains against actress alphonsa

ఎనిమిదేళ్లుగా తాను, జయశంకర్ ప్రేమించుకుని 2013లో పెళ్లి చేసుకున్నట్లు ఆమె తెలిపింది. నీ కన్నా ముందే నేను జయశంకర్‌ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు అతన్ని వదిలిపెట్టి పోరిపో, లేదంటే చంపేస్తానని ఆల్ఫోన్సా తనను బెదిరిస్తున్నట్లు ఆ మహిళ తెలిపింది.

English summary
A lady from Chennai filed a complaint against actress Alphonsa that she already married her husband and threatening her now.
Please Wait while comments are loading...