»   » సుకుమార్ ప్రొడక్షన్...దర్శకుడు ఖరారు

సుకుమార్ ప్రొడక్షన్...దర్శకుడు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నూతన దర్శకులకు అవకాశమివ్వడానికి దర్శకుడు సుకుమార్‌... సుకుమార్‌ ఎంటర్‌ టైన్మెంట్స్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ‌. ఈ పతాకంపై ఆయన ఓ కొత్త చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'కరెంటు' చిత్ర దర్శకుడిగా పరిచయమైన సూర్యప్రతాప్‌ పల్నాటి ఈ కొత్త సినిమాకి దర్శకుడు. సుకుమార్‌ తీసిన 'ఆర్య' సినిమాకి సూర్యప్రతాప్‌ దర్శకత్వ శాఖలో పని చేశారు. భాక్సాఫీస్ వద్ద 'కరెంటు' చిత్రం ఫెయిల్యూర్ అయ్యింది.

సుకుమార్‌ మాట్లాడుతూ ''ఇదొక కొత్త తరహా ప్రేమకథ. కథకు తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేసుకున్నాం. త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని ప్రకటిస్తాం. థామస్‌రెడ్డి ఆదూరితో కలసి ఈ సినిమాని నిర్మిస్తున్నాను'' అన్నారు. కూర్పు: రవి మన్ల, ఛాయాగ్రహణం: చంద్రమౌళి, కళ: సత్య.

ఇక ప్రస్తుతం సుకుమార్..సూపర్ స్టార్ మహేష్ తో '1' (నేనొక్కడినే) చిత్రం రూపొందిందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం గోవా తీరంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో ఘనంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 14న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయంలో ఇంట్రాక్ట్ అయ్యేలా చూస్తారు.


14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

English summary
Sukumar started a new production house recently. The first film of this production house will have all newbies as lead actors. This film will be directed by his former associate Surya Pratap. Previously this director has directed a film called Current starring Sushanth. The regular shoot of this film will start from December. Sukumar said that this film will be a cute love story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu