»   » నా జీవిత కథే 'సుల్తాన్': 20 కోట్లు ఇస్తానని మోసం చేసాడు, సల్మాన్ పై కేసు

నా జీవిత కథే 'సుల్తాన్': 20 కోట్లు ఇస్తానని మోసం చేసాడు, సల్మాన్ పై కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పెద్ద సినిమాలు రిలీజైన వెంటనేనో లేక రిలీజ్ కు ముందే కథ విషయమై లేక మరో విషయమైనో కేసులు, వివాదాలు తప్పటం లేదు. ఇప్పుడు రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సల్మాన్ తాజా చిత్రం సుల్తాన్ కు కూడా అదే సమస్య ఎదురైంది. ఈ చిత్రం మొన్న రంజాన్ కు విడుదలై వందకోట్లు మార్క్ దాటి రేపటి రెండు వందల కోట్లు రికార్డ్ క్రియేట్ చేసే పనిలో ఉంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం కథ విషయమై సల్మాన్ ఖాన్ పై బీహార్ కు చెందిన ఓ వ్యక్తి తనను మోసం చేసారంటూ కోర్టుకు ఎక్కి , వార్తలకు ఎక్కారు. వివరాల్లోకి వెళితే...తన జీవిత కథనే బేస్ చేసుకుని సుల్తాన్ సినిమా తీసారంటూ బీహార్ లోని ముజఫర్ పూర్ కి చెందిన సబీర్ అన్సారీ కోర్టుకు ఎక్కటం అంతటా హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

sultan salman

అతను...సల్మాన్, అనుష్క శర్మ, నిర్మాత యశ్ రాజ్ ఫిలిమ్స్, దర్శకుడు అలీ అబ్బాస్ లపై బీహార్ లోని సీజేఎం కోర్టులో ఛీటింగ్ కేసుని నమోదు చేసాడు. తన జీవిత కథని సినిమా తీస్తున్నామని, రాయల్టీగా తన కథతో సినిమా తీసినందుకు సల్మాన్ ఖాన్ ..ఇరవై కోట్లు ఇస్తానని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపించారు.

ఈ నెల ఆరవ తేదీన విడుదల అయిన తర్వాత అయినా డబ్బు ఇస్తారనుకుంటే ఇది కూడా జరగకపోవటంతో కోర్టుకు రావాల్సి వచ్చిందని అన్నారు. అలగా తన జీవిత కథ కోసం ...సల్మాన్ తనను పలుమార్లు సంప్రదించాడని, అయితే కొంత కాలం అయిన తర్వాత తన ఆలోచన విరమించుకున్నట్లు చెప్పాడని, ఇప్పుడు చూస్తే అదే కథతో సినిమా రిలీజ్ చేసారని సబీర్ పేర్కోన్నారు. సినిమా విడుదలకావటంతో తను మోసపోయినట్లు గ్రహించానని తెలియచేసాడు. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 12 వ తేదికి కోర్టు వాయిదా వేసింది.

English summary
According to the recent buzz, a cheating case has been filed against Salman Khan, Anushka Sharma, producer Yash Raj Films and director Ali Abbas by Sabeer Ansari at CJM court in Muzaffarpur, Bihar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu