»   » సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ టీజర్ అదిరింది (వీడియో)

సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ టీజర్ అదిరింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సుల్తాన్. ఈ మూవీ టీజర్ మంగళవారం విడుదలైంది. సుల్తాన్ అలీ ఖాన్ అనే మల్లయోధుని పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. సల్లూభాయ్‌కు జోడిగా అనుష్క శర్మ నటిస్తుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ సుల్తాన్‌ను భారీగా నిర్మిస్తుంది. సుల్తాన్ ఆఫీసియల్ ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు సల్మాన్ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపారు. ఈ మూవీ రంజాన్ కానుకగా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sultan Official Teaser

ఈ సినిమా కోసం సల్మాన్ చాలా కాలంగా కరసత్తులు చేస్తున్నాడు. కండల వీరుడుగా పేరున్న సల్మాన్...ఈ చిత్రంలో మరింత పర్ ఫెక్ట్ బాడీ షేపులతో ఆకట్టుకోబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Sultan Official Teaser released. Written and directed by Ali Abbas Zafar. Starring Salman Khan and Anushka Sharma. Sultan releases worldwide this Eid 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu