»   » ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది,కేక పెట్టించింది

ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది,కేక పెట్టించింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సుల్తాన్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్న చిత్రాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవిల్లో ఈ చిత్రం మొదటి స్దానంలో ఉంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఈ సినిమాలో కుస్తీ యోధుడుగా కనిపించనున్నారు.

బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, అనుష్క శర్మ ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం సుల్తాన్‌. సల్మాన్‌ ట్రైలర్‌ వీడియో లింక్‌ను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Sultan Trailer! Salman Khan Is A Man’s Man, Has A Spirit Which Can Never Be Broken

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆదిత్యా చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హరియాణా మల్లయోధుడు సుల్తాన్‌ అలీ ఖాన్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇందులో సల్మాన్‌ సుల్తాన్‌ పాత్ర పోషించగా, అనుష్క సల్మాన్‌ ప్రేయసి ఆర్ఫా పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఇద్దరి పాత్రలను పరిచయం చేస్తూ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సల్మాన్‌ఖాన్‌ రెజ్లింగ్‌ కోచ్‌గా రణదీప్‌ హూడా నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్‌ హర్యానా మల్లయోధుడు కేసరి సుల్తాన్‌ పాత్రను ధరిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌ మల్లయోధుడు టైరాన్‌ వూడ్లీ సల్మాన్‌కు మల్లయుద్ధంలో శిక్షణ ఇస్తున్నాడు. హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో సిల్విస్టర్‌ స్టాలోన్‌ను అనుకరిస్తూ సల్మాన్‌ పాత్ర వుండబోతోందంటున్నారు. ఈ సినిమా కోసం ముంబై గోరెగామ్‌లో ఉన్న ఫిలింసిటీలో ఒక పెద్ద రాజభవనం సెట్టింగ్‌ నిర్మించారు .

అనుష్క శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆదిత్ చోప్రా స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్న 'సుల్తాన్' సినిమా ఈ రంజాన్‌కు విడుదల కానుంది.

English summary
The much awaited trailer of Sultan is out, and within the first minute you'll be experiencing goosebumps as Salman Khan displays sheer power and a spirit which can never be broken. Salman, is seen as a man's man, who is capable of bringing any giant down to his knees.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu