»   » ఎఎన్ఆర్ ఆలోచన: నాగార్జున మొదటి భార్య ఆమె కావాల్సిందా?

ఎఎన్ఆర్ ఆలోచన: నాగార్జున మొదటి భార్య ఆమె కావాల్సిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, అమల టాలీవుడ్లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ అమల ఆయనకు రెండో భార్య అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మి(నాగ చైతన్య తల్లి)ని పెళ్లాడిన నాగార్జున పలు కారణాలతో ఆమెతో విడిపోయారు.

వాస్తవానికి అంతకంటే ముందు నాగేశ్వర రావు మనసులో ఉన్న ఆలోచన వేరు. నాగార్జున విదేశాల్లో చదువుకుంటున్న రోజుల్లోనే అతని పెళ్లి గురించి ఆలోచించారు ఎఎన్ఆర్. అప్పట్లో ఓ సారి నటి సుమలతను పిలిచి తన కుమారుడిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగారట ఎఎన్ఆర్.

ఈ విషయమై ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సుమలత మాట్లాడుతూ....'ఓ సినిమా షూటింగ్ సమయంలో ఏఎన్ఆర్ గారు నన్ను పిలిచి...నీ కలర్, హైట్‌కి తగిన అబ్బాయి విదేశాల నుంచి వస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటావా? అని అడిగారు. అంతటితో ఆగకుండా 'మీ అమ్మగారితో మాట్లడమంటావా?' అని కూడా అడిగారు. ఆ అబ్బాయి ఎవరని నేను అడగటంతో.. అతను ఎవరో కాదు నా కొడుకు నాగార్జున అని ఏఎన్ఆర్ చెప్పారు' అని తెలిపారు.

సుమలత

సుమలత

అయితే స్వయంగా ఏఎన్ఆర్ అడిగిన పెళ్లి విషయమై సుమలత ఎలా స్పందించారు? నాగార్జునకు భార్య కావాల్సిన అవకాశాన్ని సుమలత ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు.

మొదటి భార్య

మొదటి భార్య

నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి(నిర్మాత రామానాయుడు కూతురు). నాగార్జునతో విడిపోయినప్పటికీ లక్ష్మి దగ్గుబాటి తన తనయుడు నాగ చైతన్యతో టచ్ లోనే ఉంటున్నారు.

నాగ్-అమల

నాగ్-అమల

తనతో పాటు సినిమాల్లో నటించిన అమలపై నాగార్జున మనసు పారేసుకున్నారు. ఆమెను తన రెండో భార్యగా చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా అఖిల్ జన్మించారు.

సాఫీగా..

సాఫీగా..

మొదటి భార్యతో విడిపోయినా నాగార్జున లైఫ్ ఎలాంటి విబేధాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. ప్రస్తుతం నాగార్జున ఇద్దరు కుమారులు కూడా పెళ్లీడుకొచ్చారు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న నాగ చైతన్య, అఖిల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు.

English summary
Sumalatha glittered as an actress in 80’s and 90’s!! Akkineni Nageswara Rao told Sumalatha that, there is a perfect match for her to marry and further told Sumalatha that, he knew a boy who is 6 feet height with fair color. Currently, he is pursuing his studies in a foreign country and asked her if she is ready to marry him?. He also told her to convey this information to her mother if she is interested. After that, Sumalatha and her mother approached Nageswara Rao. He surprised them with his answer, that boy is none other than his son Nagarjuna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu