»   » మంచి పార్టీ చూసి చేరిపోతా.., ఎమ్మేల్యేగా పోటీ చేస్తా: సుమన్

మంచి పార్టీ చూసి చేరిపోతా.., ఎమ్మేల్యేగా పోటీ చేస్తా: సుమన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియర్ హీరో సుమన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు హీరో.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు అంతే. క్రేమ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడీ హీరో మనసు పాలిటిక్స్ పై పడింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నాడు. ఈ కారణంగానే ఆయన కొన్నాళ్లుగా పొలిటికల్ సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నాడు.

రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనే

రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనే

గత కొంత కాలంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతోనే వెనుకబడిన తరగతుల వారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని గతం లో రెండు మూడు సార్లు సుమన్ చెపుకొచ్చాడు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు.

మంచి పార్టీ వస్తే

మంచి పార్టీ వస్తే

శనివారం ఆయన్ను పలాసలో సుమన్‌ పరామర్శించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మంచి పార్టీ వస్తే.. అందులో చేరి రాజకీయంగా సేవచేస్తానని పక్కాగా చెప్పాడు హీరో సుమన్. ఏ రాజకీయ పార్టీ అన్నది ముందు ముందు చెబుతాడట.

రీర్ ఫేడ్ అవుతున్న సమయంలో

రీర్ ఫేడ్ అవుతున్న సమయంలో

సాధారణంగా సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో చాలా మంది తారలు రాయకీయ రంగ ప్రవేశం చేస్తారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో చాలామంది క్లిక్ అయ్యారు కూడా. ఇప్పుడు అదే దారిని ఎన్నుకున్నాడు ఒకప్పటికి స్టార్ హీరో సుమన్. కెరీర్ ఫేడ్ అవుతున్న సమయంలో విలన్ గా మారీన సుమన్ అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. అయిన లాభం లేక పోవడంతో ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నాడు.

చర్చ జరగకుండా వుంటుందా

చర్చ జరగకుండా వుంటుందా

కొత్తగా ఆయన రాజకీయాల్లోకి వస్తానంటోంటే, ఏ రాష్ట్రంలో.. ఏ రాజకీయ పార్టీలో.. అన్న చర్చ జరగకుండా వుంటుందా.? 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లో వస్తానని ప్రకటించాడు సుమన్‌. ఏ రాజకీయ పార్టీ అన్నది ముందు ముందు చెబుతాడట. ఏదో ఒక పార్టీలో చేరిపోవడం కాదు, ప్రజల కోసం పాటుపడే పార్టీలో మాత్రమే చేరతానని చెప్పాడు.

ఏ రాష్ట్రం నుంచి

ఏ రాష్ట్రం నుంచి

అసలు అలాంటి పార్టీ ఏదీ అని మాత్రం మనం చూడకూడదు ఆ సమయానికి ఏ పార్టీ దొరికితే అదే ప్రజలకోసం పాటు పడే పార్టీ అనుకోవాలన్న మాట. మరి, సుమన్‌ రాజకీయ ప్రయాణం ఎలా వుంటుంది.? ఏ పార్టీ రంగుని ఆయన పులుముకుంటాడు.? అంతకు మించి, తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి ఆయన పోటీ చేస్తాడు.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.

ఎమ్మెల్యేగా పోటీ

ఎమ్మెల్యేగా పోటీ

2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు కూడా ఆమధ్య ఒంగోలు సభ లో క్లారిటీ కూడా ఇచ్చాడు కూడా. అయితే, అది ఏ పార్టీ నుంచి అన్న విషయం మాత్రం చెప్పలేదు. బాహుశా.. వైసీపీ, టీడీపీలలో ఏదో ఒక పార్టీలో సుమన్ పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చు. ఇక, సినిమాల విషయానికొస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయితే సుమన్ ఫుల్ బిజీ బిజీ గా ఉన్నాడు..

English summary
Suman made it clear that his support will be for those Powerful Leaders who could address the people's issues. 'I'm contributing my bit to the society in the form of social service. I will choose the party led by a committed leader,' he told.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X