»   »  ఆర్టీసీ బస్సు నే నమ్ముకున్నాడు

ఆర్టీసీ బస్సు నే నమ్ముకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కారు చుట్టూ తిరిగే కథలు, విమానంలో జరిగే కథలు చూసాం. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఎక్కువ భాగం జరిగే సినిమా చూడబోతున్నాం. సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`. ఈ చిత్రంలో ఆర్టీసీ బస్సు కీ రోల్ ప్లే చేయబోతోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ ``మా సినిమా తొలి షెడ్యూల్‌ను అర‌కు, ఒడిశాలో 25 రోజులు చిత్రీక‌రించాం. రెండో షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి 20 నుంచి 30 వ‌ర‌కు వికారాబాద్‌లో చేశాం. వికారాబాద్‌లోని బ‌స్ డిపో, బ‌స్టాండు, ఫారెస్ట్ లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించాం. మూడో షెడ్యూల్‌ను ఈ నెల 20 నుంచి మార్చి 5 వ‌ర‌కు చిత్రీక‌రిస్తాం. దాంతో ఒక పాట మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది.

Sumanth Ashwin's Right Right in Summer 2016

మిగిలిన ఆ పాట‌ను ఔట్‌డోర్‌లో చిత్రీక‌రిస్తాం. సినిమా మొత్తం పూర్తి చేసి వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో పూర్తి భిన్న‌మైన సినిమాగా నిలుస్తుంది.` బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులూ, చేర్పులూ చేసి తెర‌కెక్కిస్తున్నాం. ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలున్న చిత్ర‌మిది`` అని తెలిపారు.

`బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి హీరోయిన్ . ఇటీవ‌లే ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్త‌యింది. నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌క` శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాట‌లు: శ్రీమ‌ణి, కెమెరా: శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు: `డార్లింగ్‌` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌: కె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌: జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను.

English summary
Sumanth Ashwin chose to remake Malayalam super hit ‘Ordinary’ that released in 2012 and became a huge hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu