»   »  సుమంత్-పౌరుడు?

సుమంత్-పౌరుడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఇంకా పేరు పెట్టని సినిమాలో సుమంత్ హీరోగా చేస్తున్నాడు. ఇదిఇలా ఉంటే అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న టెలివిజన్ సీరియల్ యువ ప్రారంభోత్సవానికి సుమంత్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఆయన నటిస్తన్న సినిమాకు రెండు పేర్లు అనుకున్నట్టు చెప్పారు. 1.పౌరుడు 2.పౌరుషం లలో ఏదో ఒకదానిని ఫైనల్ చేయనున్నట్టు చెప్పాడు. అయితే పౌరుడునే ఫైనల్ చేయవచ్చని అనుకుంటున్నారు. రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాను సుమంత్ సోదరి సుప్రియ ఎస్ఎస్ క్రియేన్స్ బ్యానర్ పై నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X