»   » నవ్వుతూంటారంతే.. నరుడా డోనరుడా ట్రైలర్

నవ్వుతూంటారంతే.. నరుడా డోనరుడా ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నట వారసుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్. కెరీర్ తొలి నాళ్ళలో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అయితే తర్వాత సుమంత్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు.సుమంత్ తెరమీదికొచ్చి రెండేళ్ళు గడిచింది 2014లో 'ఏమో గుర్రం ఎగరా వచ్చు' సినిమా చేసిన ఈ అక్కినేని హీరో అటు పై మరో సినిమాకి సైన్ చేయనే లేదు. కొద్ది కాలం క్రితం మొదలైన హిందీ సినిమా 'విక్కీ డోనర్' రీమేక్‌తో సుమంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి పలు టైటిల్స్ పరిశీలించగా చివరికి 'నరుడా డోనరుడా' అనే టైటిల్ ని ఖాయం చేసారు. ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్ జంటగా నటించిన హిందీ చిత్రం 'విక్కీ డోనర్'. ప్రముఖ హిందీ కథానాయకుడు జాన్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలైంది. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించింది. స్పెర్మ్(వీర్యం) డొనేషన్ కు సంబంధించిన సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

వీర్య కణాలను దానం చేసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కగా సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుండగా తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కావడం విశేషం. ఇక ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే నవ్వుల తో థియేతర్ దద్దరిల్లే లా ఉంది... అసలే కామెడీకి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కావటం తో పిచ్చ పిచ్చగా నవ్విస్తోంది.

 Sumanth's Naruda Donaruda Movie Theatrical Trailer

క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందించిన ష‌నీల్ డియో ఈ సినిమా సినిమాటోగ్ర‌ఫీని అందిస్తుండ‌గా, క్ష‌ణం, గుంటూర్ టాకీస్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ, సాగ‌ర్ రాచ‌కొండ‌ మాట‌లు అందిస్తున్నారు. వై.సుప్రియ‌, జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.

English summary
Superstar Mahesh Babu on Tuesday unveiled the trailer of upcoming Telugu comedy "Naruda Donoruda", the remake of Ayushmann Khurrana starrer "Vicky Donor"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu