»   »  సన్ టీవీ చేతికి శివకార్తీకేయన్ సినిమా శాటిలైట్ హక్కులు.. హ్యాట్రిక్ దిశగా పోన్‌రామ్

సన్ టీవీ చేతికి శివకార్తీకేయన్ సినిమా శాటిలైట్ హక్కులు.. హ్యాట్రిక్ దిశగా పోన్‌రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడుకు చెందిన మీడియా దిగ్గజం సన్ నెట్‌వర్క్‌తో సినీ నిర్మాణ సంస్థ 24ఏఎమ్ స్టూడియోస్ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. భవిష్యత్ మరిన్ని మంచి చిత్రాలను నిర్మించే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకొన్నామని, ఈ భాగస్వామ్య వివరాలను వెల్లడించానికి తాము సంతోషిస్తున్నామని 24ఏఎమ్ సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్ర నిర్మాణ ప్రక్రియలో భాగంగా 24ఏఎమ్ సంస్థ తన నాలుగో ప్రొడక్షన్‌ను ప్రారంభించింది. పొన్‌రాం దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సూరి, బాలసుబ్రమణ్యం, యుగభారతి తదితరులు భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటికే శివకార్తీకేయన్, పోన్‌రాం కాంబినేషన్‌లో వారుత పదాత వాలిబర్ సంగం, రజనీ మురుగన్ చిత్రాలు వచ్చాయి. వరుసగా మూడో సినిమాను విజయవంతం చేసి హ్యాట్రిక్ సాధించేందుకు శివకార్తీకేయన్, పోన్‌రాం రెడీ అవుతున్నారు.

SUN TV has bagged the satellite rights of Sivakarthikeyan starrer 24AM Studios’ Production No. 4

24ఏఎమ్ సంస్థ గత చిత్రాలను భారీ హంగులతో రూపొందించిన సంగతి తెలిసిందే. గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్‌గా ఈ సినిమాను రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. 24ఏఎమ్ సంస్థ రూపొందించిన వెలైక్కరన్ చిత్రం హక్కులను గతవారం సన్ టీవి దక్కించుకొన్నది. అంతేకాకుండా తాజా చిత్రం ప్రొడక్షన్ నంబర్ 4 చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను వారంలోపే సన్ టీవీ చేజిక్కించుకోవడం విశేషం.

ఈ చిత్రానికి తమిళ సినీ పరిశ్రమలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పేరున్న ముత్తురాజ్ ఈ సినిమాకు పనిచేస్తుండగా, అనల్ అరసు కోరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే బాహుబలి2 సినిమాకు వీఎఫ్ఎక్స్ పనులకు సూపర్‌వైజర్‌గా పనిచేసిన కమలా కన్నన్ పనిచేయడం అదనపు ఆకర్షణగా మారింది.

English summary
The technical team is equally power packed with India’s top-rated production designer Muthuraj, India’s most sought-after stunt choreographer Anl Arasu and the VFX supervisor Kamala Kannan, who has Bahubali 2 to his credit. An interesting fact is that only last week rights to 24AM Studio’s upcoming movie Velaikkaran were bought by SUN TV and word on the street has it that within the first week of shooting SUN TV has also bought the satellite rights to the new production no.4.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu