twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాడిని చెప్పుతో కొట్టాలి, జైలుకెళ్లాడు, 420..... : నిర్మాతపై హీరో సందీప్ కిషన్ సంచలనం

    By Bojja Kumar
    |

    Recommended Video

    హాట్ సాంగ్ అన్నాడు, వాడిని చెప్పుతో కొట్టాలి, జైలుకెళ్లాడు, 420

    "కుక్కతో సినిమా చేస్తా... సందీప్ కిషన్‌తో చేయను, అతడో మోసగాడు" అంటూ ఓ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం నెల రోజుల క్రితం సంచలనం అయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ నటించిన 'ప్రాజెక్ట్ జెడ్' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఎస్.కె.బషీద్ ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఆ నిర్మాత అన్నేని మాటలన్నీ, దారుణమైన ఆరోపణలు చేసినా సందీప్ కిషన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తాజాగా సందీప్ కిషన్ ఈ విషయమై స్పందించారు.

    కుక్కులు మొరుగుతాయి

    కుక్కులు మొరుగుతాయి

    ఎస్.కె.బషీద్ విషయంలో అప్పుడే స్పందించాలని అనుకున్నాను. అయితే నా సన్నిహితులు, వెల్ విషర్స్ వచ్చి కుక్కలు మొరుగుతాయి, మనం స్పందించడం అవసరమా? మనం లీగల్‌గా వెళ్లాలని చూస్తున్నాం అని నన్ను ఆపారు. ఇపుడు ప్రెస్ మీట్ పెడదామనుకున్నా కూడా ఆపారు. కానీ ఎక్కడికెళ్లినా నన్ను ఈ విషయం గురించే అడుగుతున్నారు. అందుకే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అంటూ.... సందీప్ కిషన్ ఈ ఇష్యూపై రెస్పాండ్ అయ్యారు. అతడు 420, అబద్దాలు చెప్పాడు, చెప్పుతో కొట్టాలి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

    ఇదీ అసలు సంగతి

    ఇదీ అసలు సంగతి

    మాయావన్ అనే ఒక తమిళ సినిమాను తమిళంలో మొదలు పెట్టి కాంట్రాక్టులో దీన్ని తెలుగులో డబ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇది పోలీస్ సినిమా కాబట్టి బైలింగ్వల్ సూటవ్వదు, ప్రతి సీన్లో పోలీస్ యూనిఫాంతో పాటు బ్యాక్ డ్రాప్ వర్కౌట్ అవ్వదు. అందుకే అలా చేశాం. ఇందుకోసం లావణ్యను కూడా ఒప్పించాం. నేను తమిళ సినిమా చేసినపుడు దానికి డబ్బింగ్ చెప్పాలనో, తెలుగులో పబ్లిసిటీ చేయాలనో రూల్ లేదు. కానీ పర్సనల్ గా కేర్ తీసుకుని ఈ సినిమాకు 7 రోజుల డబ్బింగ్ రామానాయుడు స్టూడియోలో సెట్ చేశాను. అందుకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి.... అని సందీప్ కిషన్ తెలిపారు.

     అప్పటి వరకు బషీద్ ఎవరో తెలియదు

    అప్పటి వరకు బషీద్ ఎవరో తెలియదు

    ‘మాయావన్' అనే సినిమాను సివి కుమార్ అనే ఒక మంచి తమిళ నిర్మాతకు చేశాను. అతడే డైరెక్షన్ కూడా చేశాడు. ఈ సినిమాను మొదట సివి కుమార్ ఒక మంచి పార్టీకి మంచి రేటుకు అమ్మాడు. ఈ సినిమా డిలే అవ్వడం వలన, ఆ పార్టీకి ఏవో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వారు మేము ఈ సినిమా చేయడం లేదు వేరే వారికి అమ్ముకోండి అని చెప్పారట. ఈ ఇన్ఫర్మేషన్ నాకు లేదు. నేను అప్పటి వరకు అనిల్ సుంకర గారితో, భవ్య క్రియేషన్స్ వారితో మాట్లాడితే తెలుగు హక్కులు తీసుకుంటామని కూడా అన్నారు. ఈ డిస్క్రషన్స్ గ్యాపులో సివి కుమార్ ఏవో ప్రాబ్లమ్స్ లో పడ్డారు. మీరు వినే ఉంటారు అన్బు అనే ఫైనాన్సియర్ ఇష్యూ. అతడి వల్ల ఓ నిర్మాత సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇతడితో సివి కుమార్ కు ఏదో సమస్య వచ్చి అర్జంటుగా డబ్బులు అవసరం వచ్చి అమ్మేశారు. అమ్మిన తర్వాత ఎవరికి అమ్మారు అని అడిగితే ఇలా ఎస్.కె.బషీద్ పేరు చెప్పారు. అప్పటికి నాకు ఎస్.కె.బషీద్ ఎవరో కూడా నాకు తెలియదు.... అని సందీప్ కిషన్ తెలిపారు.

     మొదటి సారి అపుడే కలిశాను

    మొదటి సారి అపుడే కలిశాను

    అపుడు బషీద్ గురించి కనుక్కుంటే రకరకాల స్టోరీలు విన్నాను. ఇక చేసేది లేక మిన్నకుండిపోయాను. అపుడు నేను లైఫ్ లో ఫస్ట్ టైమ్ తమిళంలో మాయావన్ ఆడియో రిలీజ్ సమయంలో బషీద్‌ను కలిశాను. అప్పటికే అతడి గురించి రకరకాలు వార్తలు విని చాలా టెన్షన్లో ఉన్నాను.

     సందీప్ కిషన్ ఏసెయ్ అన్నాడు... గుండె ఒక్కసారి ఆగిపోయింది

    సందీప్ కిషన్ ఏసెయ్ అన్నాడు... గుండె ఒక్కసారి ఆగిపోయింది

    అపుడు నా దగ్గరకు వచ్చి ఈ సినిమాకు ఒక టైటిల్ అనుకుంటున్నాను భయ్యా అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాను. ‘సందీప్ కిషన్స్ ఏసేయ్' అన్నాడు. అతడు అలా అనగానే నాకు గుండె ఆగిపోయింది. పక్కన లావణ్య నవ్వుతోంది. వద్దండీ ఇంకా ఏదైనా ట్రై చేయండి అన్నాను. రెండో సారి ‘సందీప్ కిషన్స్ స్టామినా' అంటూ మరో టైటిల్ చెప్పారు. మరోసారి నా గుండె గబగబా కొట్టేసుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రాజెక్ట్ జెడ్ అనేది కూడా గొప్ప టైటిల్ కాదు అది నాకు తెలుసు. ఏసెయ్, స్టామినా కంటే బెటర్ అనిపించింది..... అని సందీప్ తెలిపారు.

    అతడి డైరెక్షన్లో హాట్ సాంగ్ తీద్దాన్నాడు

    అతడి డైరెక్షన్లో హాట్ సాంగ్ తీద్దాన్నాడు

    సెకండాఫ్ లో లావణ్యతో కలిసి ఓ హాట్ సాంగ్ తీద్దాం, నేను డైరెక్ట్ చేస్తాను అన్నాడు. దెబ్బకు లావణ్య భయపడిపోయి తమిళ వెర్షన్ కు కూడా రావడం మానేసింది.... అని ఎస్.కె.బషీద్ గురించి సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.

     అంతా అబద్దం, సినిమాను ఈ రేటుకు అమ్మాం

    అంతా అబద్దం, సినిమాను ఈ రేటుకు అమ్మాం

    ఈ సినిమా మొదట 2 కోట్ల 10 లక్షలకు ఒక పార్టీకి అమ్మితే.... వారు వెనక్కి వెళ్లడంతో తర్వాత ఎస్.కె బషీద్ రూ. 1 కోటి 45 లక్షలకు కొన్నారు. సినిమా డిలే అయిపోయి వేరే దారి లేక ఆ రేటకు సివి కుమార్ అమ్మేశాడు. సినిమా లేటవ్వడంతో సివి కుమార్ ఇంకో 20 లక్షలు తగ్గించాడు. మాయావన్ సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చినా ఎస్ కె బషీద్ బ్యాలెన్స్ డబ్బులు కట్టేలేదు. అప్పటికి రూ. 45 లక్షలే కట్టాడు..... అని సందీప్ కిషన్ తెలిపారు.

     నానా బూతులు తిట్టాడు

    నానా బూతులు తిట్టాడు

    మిగతా డబ్బు ఇవ్వమంటే డిలే అయింది నేను కట్టను అంటాడు. సివి కుమార్ నా దగ్గరకు వచ్చి మాట్లాడమంటే మాట్లాడాను. అపుడు నా పక్కనే ఉన్న సివి.కుమార్ ను అమ్మనా బూతులు తిట్టి నేను పైసా ఇవ్వను ఫ్రెండ్లీగా రిలీజ్ చేసుకుందాం కంటెంటు పంపమనండి అంటూ బషీద్ డిమాండ్ చేశాడు. ఇంకా అతడు కోటి బాకీ ఉన్నా సినిమాను ఫ్రెండ్లీగా ఎలా ఇస్తారు? ఈ విషయంలో వారి గొడవ వారు పడతారని వదిలేశాను.... అని సందీప్ కిషన్ తెలిపారు.

     3 కోట్ల లాస్ ఎలా?

    3 కోట్ల లాస్ ఎలా?

    ఇపుడు బషీద్ మీడియా ముందుకు వచ్చి మూడు కోట్లు లాసైంది అని చెబుతున్నాడు. అంతా అబద్దం. అతడు కట్టింది కేవలం 40 లక్షలే. సినిమా ప్రచారం కూడా చేయలేదు. హైదరాబాద్ లో ఒక్క పోస్టర్, హోర్డింగ్ కూడా లేదు. టీవీ యాడ్ లేదు. ఆన్ లైన్లో ఒక యాడ్ కూడా లేదు. ఏమీ లేదు. అయితే పేపర్ యాడ్ మాత్రం 20 సార్లు వేశారు. పేపర్ యాడ్ ఒకసారి 33 వేలు. అది వంద సార్లు వేసినా 33 లక్షలకు మించదు. అంతా కలసి కోటి పెట్టాడుకుందాం. మరి మూడు కోట్ల నష్టం ఎక్కడి నుండి వచ్చింది?.... అంటూ సందీప్ కిషన్ ప్రశ్నించారు.

     జైలుకెళ్లాడు, 420...

    జైలుకెళ్లాడు, 420...

    ఎస్.కె. బషీద్ అనే వ్యక్తి నాలుగు సార్లు జైలుకెళ్లాడు, చెక్ బౌన్స్ కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, త్రెట్టెండింగ్ కేసులు అతడిపై ఉన్నాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి ఐదేళ్లు బ్యాన్ అయ్యారు. ఇపుడు మళ్లీ బ్యాన్ చేయబోతున్నారు కూడా... కేసు స్ట్రాంగ్ గా నడుస్తోంది. ఇలాంటి వ్యక్తి వచ్చి నా గురించి మాట్లాడితే ఎలా నమ్ముతారు. అందులో ఎంత నిజం ఉంది అనేది కూడా ఆలోచించరా? అని... సందీప్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు.

     అందరికంటే నాకే పెద్దలాస్

    అందరికంటే నాకే పెద్దలాస్

    ‘మాయావన్' లాంటి మంచి సినిమా తెలుగులో రానందుకు నాకే పెద్ద లాస్. ఎస్.కె. బషీద్ లాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండటం మంచిది కాదు. ఇకపై ఎస్.కె బషీద్ ఎక్కడ ఎక్కడ మాట్లాడినా నేను అక్కడ ఉంటాను అని సందీప్ కిషన్ తెలిపారు.

    కుక్కతో సినిమా చేస్తా... సందీప్ కిషన్‌తో చేయను, మోసగాడు: నిర్మాత కంటతడి!

    కుక్కతో సినిమా చేస్తా... సందీప్ కిషన్‌తో చేయను, మోసగాడు: నిర్మాత కంటతడి!

     క్లిక్ చేయండి. క్లిక్ చేయండి.

    English summary
    Sundeep Kishan Clarifies About Controversy With Producer Sk Basheed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X