»   » సందీప్ కిషన్ కి ఎవరో బాగా తెలుసున్నవాళ్లే చేసుంటారు, లేకపోతే...

సందీప్ కిషన్ కి ఎవరో బాగా తెలుసున్నవాళ్లే చేసుంటారు, లేకపోతే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మనం ఆర్డర్ చేయకుండానే మనకు అమిజాన్ నుంచో ఫ్లిఫ్ కార్ట్ నుంచో పార్శిల్ వస్తే.. ఓపెన్ చేసి చూస్తే అందులో ఏదైనా వింత వస్తువు వస్తే ఆశ్చర్యంగానూ, షాకింగానే ఉంటుంది. అలాంటి సందర్బమే యంగ్ హీరో సందీప్ కిషన్ కు ఎదురైంది.

ఎవరో కొందరు వ్యక్తులు సందీప్‌ కిషన్ ఎడ్రస్, ఫోన్‌ నంబరు జత చేసి అమెజాన్‌లో బట్టలను ఆర్డర్‌ చేశారు. హీరో సందీప్ కిషన్ ఇంటి నుండి బయటకెళ్ళగానే ఆయనకో ఫోన్ వచ్చిందట. అది అమెజాన్ డెలివరీ బాయ్ చేసిన కాల్. నెను మీ ఇంటి బయట ఉన్నాను. మీకో పార్శిల్ వచ్చింది అని అతను చెప్పగానే సందీప్ కిషన్ ఆశ్చర్యంగా ఇంటికి వెళ్లి పార్సిల్ తీసుకున్నాడట.

Sundeep Kishan received Surprise gift from Santa

తీరా ఆ పార్శిల్ ను ఓపెన్ చేయగానే ఒక చిన్నపాటి లాగుతో పాటు క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు కొత్త సంవత్సరానికి ఆశీస్సులు. ఇట్లు సీక్రెట్ శాంటా అని మెసేజ్ కూడా ఉంది. ఈ విషయాన్ని ట్వట్టర్ లో సందీప్ తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

'అమెజాన్‌ డెలివరీ బాయ్‌ నాకు ఫోన్‌ చేసి డెలివరీతో బయట ఎదురుచూస్తున్నానని చెప్పాడు. డెలివరీ తీసుకోవడానికి తిరిగి ఇంటికి వెళ్లాను. నాకు నవ్వాలో, భయపడాలో తెలియడం లేదు. నా నంబరు, చిరునామా ఎవరికో ఎలా తెలిసింది. ఇది నా స్నేహితులు చేసిన పనిలా అనిపించడం లేదు.. ఎందుకంటే ఆట పట్టించడానికి ఇలా నా నంబరు డెలివరీ కాంటాక్ట్‌కి ఇవ్వరు కదా' అని ట్వీట్‌ చేశారు.

సందీప్‌కి వచ్చిన అమెజాన్‌ పార్సిల్‌లో క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ గ్రీటింగ్‌ కార్డు, ఓ పొట్టి ప్యాంటు ఉన్నాయి. ఏదైమైనా సందీప్ కిషన్ కు శాంటా వచ్చి క్రిస్మస్ గిప్ట్ ఇచ్చి వెళ్లిపోయాడు. హ్యాపీ కదా.

కెరీర్ విషయానికి వస్తే...సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'నక్షత్రం' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై సందీప్ కిషన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ కు ఒక్క హిట్టు కూడా లేదు. ఇటీవల విడుదలైన 'ఒక అమ్మాయి తప్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. కృష్ణ వంశీ లాంటి స్టార్ దర్శకుడితో చేస్తుండటంతో తనకు కలిసొస్తుందని భావిస్తున్నాడు.

English summary
Sundeep Kishan received a Short as a surprise gift from secret Santa. He really can't understand how can a person know his address and phone number to send this gift.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu