»   » జూ ఎన్టీఆర్‌ ట్రై చేస్తే....సందీప్ కిషన్‌‌‌కి దక్కింది!

జూ ఎన్టీఆర్‌ ట్రై చేస్తే....సందీప్ కిషన్‌‌‌కి దక్కింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'జోరు' అనే టైటిల్‌తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైటిల్ ఎన్టీఆర్‌కు కాకుండా మరో హీరోకు ఖరారైంది. ఇటీవల 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చచుకున్న సందీప్ కిషన్ కిషన్ త్వరలో 'జోరు' సినిమాతో రాబోతున్నాడు.

సందీప్ కిషన్ హీరోగా నూతన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ కీర్తి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'గుండెల్లో గోదారి' వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నిర్మాతలు అశోక్, నాగార్జునలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sundeep Kishan’s next is titled Joru

ఈ చిత్రంలో హీరో సందీప్ కిషన్ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశిఖన్నా, ప్రియాబెనర్జి, సుష్మలు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రం కథకు అనుగుణంగా 'జోరు' టైటిల్ యాప్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా 'జోరు'ను రూపొందిస్తున్నట్లు దర్శకుడు కుమార్ నాగేంద్ర తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై నెలాఖరులో గాని, ఆగష్టు నెల ప్రధమార్ధంలో గాని విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత లు అశోక్, నాగార్జున లు తెలిపారు. మరో వైపు సందీప్ కిషన్ నటించిన 'రారా కృష్ణయ్య చిత్రం' విడుదలకు సిద్దమవుతోంది.

English summary
Sundeep Kishan’s next is titled Joru. This film will be directed by Kumar Nagendra of Gundello Godari fame. Interesting aspect of this film is that Sundeep will get to romance three heroines in this flick.. Rasi Khanna, Priya Banerjee and Sushma will play the female leads.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu