»   » 'నిను వీడని నీడని నేనే'...సందీప్ కిషన్ కి ఏంటో ఈ ట్విస్ట్

'నిను వీడని నీడని నేనే'...సందీప్ కిషన్ కి ఏంటో ఈ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. రచయిత రాజసింహ తడినాడ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. బోగాది అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తొలిసారిగా నిత్యమీనన్ సందీప్‌కి జోడీగా నటించింది. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

నిను వీడని నీడని నేనే అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూండగా ఈ టీజర్ కట్ చేసారు. ఈ టీజర్ ఖచ్చితంగా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. అవునూ హీరోయిన్ ని..హీరో ఇలా ...ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూండగానే పరిచయం చేయటం నిజంగానే బాగుంది.

Sundeep Kishan's Okka Aammayi Thappa Movie Teaser

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా మిక్కి జే మేయర్ సంగీతమందించిన పాటలు మే 8న శిల్పకళావేదికలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపారు. శ్రీమణి, శ్రీ శశి జ్యోత్స్న మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ ఈ సినిమాకి గీత రచయితలు.

సరికొత్త కథనంతో సాగే ఈ సినిమాలో సందీప్ పాత్ర, లుక్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయని అన్న దర్శకుడు రాజసింహ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మే నెలలోనే సినిమా విడుదల కానుందని అన్నారు.

రేవతి, రవి కిషన్, అలీ, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, నళిని, జ్యోతి, రేవతి కీలక పాత్రల్లో కనపడనున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాత : మాధవి వాసిపల్లి, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : రాజసింహ తాడినాడ.

English summary
Sundeep Kishan's Okka Aammayi Thappa Movie Teaser
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu