»   » కుర్రాడు ట్రాక్ లో పడ్డాడు..ట్రైలర్ బాగుంది

కుర్రాడు ట్రాక్ లో పడ్డాడు..ట్రైలర్ బాగుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "వెంకటాద్రి ఎక్సప్రెస్" చిత్రం మంచి హిట్ అయినా సందీప్ కిషన్ క్యాష్ చేసుకోలేకపోయాడనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత టైగర్, బీరువా వంటి చిత్రాలు వచ్చి మళ్లీ అతని కెరీర్ ని వెనక్కి తీసుకు వెళ్లిపోయాయి. అది గమనించాడో ఏమో కానీ సందీప్ కిషన్ ఈ సారి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రన్ టైటిల్ తో ఆయన ఓ చిత్రం చేస్తున్నారు. ఆ ట్రైలర్ చూస్తూంటే మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. మీరూ ఆ ట్రైలర్ ని ఇక్కడో లుక్ వేయండి.

తమిళంలో సూపర్‌హిట్‌ అయిన నేరం చిత్రాన్ని అనిల్‌ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. 2013లో చాలా చిన్న సినిమాగా వచ్చితమిళం, మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ‘నేరం'. నేరమ్ చిత్రం తమిళ,మయాళ భాషల్లో ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదొక డార్క్ కామెడీ చిత్రం. నాగ చైతన్య చేస్తున్న రీమేక్... ఒరిజనల్ ప్రేమమ్ చిత్రం దర్శకుడు తొలి చిత్రం ఇది. ఈ చిత్రంతోనే అతనికి మంచి పేరు వచ్చింది. నజ్రియా నసీమ్, నవీన్ పోలి ఈ సినిమాలో చేసారు.

అలాగే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రం చేసి ఇప్పుడు షి అనే క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్న మహత్ రాఘవేంద్ర ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రను పోషించటానికి కమిటయ్యారని తెలుస్తోంది. మహత్ కు, సందీప్ కిషన్ కు ఉన్న స్నేహంతో మహత్ ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.

English summary
Watch the Concept Teaser of RUN Starring Sundeep Kishan and Anisha Ambrose. Directed by Anil Kanneganti, the film hits cinemas on March 23rd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu