Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హద్దుమీరిన సీన్స్ ని తీసేసారు...కలెక్షన్స్ ఎఫెక్టు?
హైదరాబాద్ : సినిమాలో ఒళ్లు చూపిస్తే డబ్బులు వస్తాయనుకోవడం భ్రమ. ఈ సినిమాలోని ఎరోటిక్ సీన్లన్నీ సినిమాటిక్‌గా ఎంతవరకు వెళ్లవచ్చో ఆ హద్దుల్లోనే చేశాను. కనీసం బాలీవుడ్ స్థాయికి కూడా వెళ్లలేదు. అయినప్పటికీ కొన్ని సీన్లను తొలగించాం అంటున్నారు సునీల్ కుమార్ రెడ్డి. అయితే ఈ సీన్స్ తో హైప్ క్రియేట్ అయ్యి..ఈ చిన్న సినిమాకు ఓపినింగ్స్ బాగా వచ్చాయి..కలెక్షన్స్ కూడా ఫరవాలేదనిపించే స్ధాయిలో ఉన్నాయి. ఇప్పుడీ సీన్స్ తీసేయటం ఏమన్నా కలెక్షన్స్ పై పడతాయా లేదా అన్నది చూడాలి.
సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఒక క్రిమినల్ ప్రేమకథ'. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మోతాదు మించి బూతు ఉందని టాక్ వచ్చింది. అయితే ఇప్పటివరకూ తెలుగు తెరపై చర్చిందని సబ్జెక్టుని డీల్ చేసారని ప్రశంసలైతే వచ్చాయి. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడాతూ పై విధంగా స్పందించారు.

అలాగే... ఇంట్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. భారతదేశంలో 53శాతం ఆడపిల్లలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ది మొదటి స్థానం. ఇంట్లో ఆడపిల్లల ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఫాదర్స్‌కు, అంకుల్స్‌కు ఒక హెచ్చరికలా ఈ సినిమా తీశా. డేంజరస్ అండ్ డెలికేట్ ఇష్యూ ఇది. అది కూడా పేరెంట్స్ ఈ సినిమా చూడాలనే ఉద్దేశంతో. ప్రతి పేరెంట్ ఈ సినిమా చూడాలి. ఇంట్లో ఆడపిల్లల పరిస్థితిని అర్థం చేసుకోవాలి' అని చెప్పారు.
హీరో మాట్లాడుతూ... 'వీధుల్లో ఎవరో ఏదో అంటున్నారని కేసులు పెడుతున్నాం? ఇంట్లోనే బాబాయో? స్కూల్లో టీచరో? అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? ఏ చట్టాలు వీటి గురించి మాట్లాడుతున్నాయి' అని ఓ సారి ఓ అమ్మాయి నన్ను సూటిగా ప్రశించింది. దాని గురించి పుట్టిన ఆలోచనలతోనే నేను 'ఒక క్రిమినల్ ప్రేమకథ'ను తెరకెక్కించాను. ముసుగుల్లో ఉన్న చాలా విషయాలకు సంబంధించి బాహాటంగా ఈ సినిమాలో మాట్లాడగలిగాను. ఇది కేవలం డాక్యుమెంటరీ కాదు. ఓ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాకూ ఉన్నాయి. సంపూర్ణమైన సినిమా ఇది.'' అన్నారు.