»   » చెక్కమొద్దులా ఉన్నాడు, నటన రాదన్నారు.. ఇపుడు వారెక్కడ?

చెక్కమొద్దులా ఉన్నాడు, నటన రాదన్నారు.. ఇపుడు వారెక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి 1992లో 'బల్వాన్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. దిల్వాలె, బోర్డర్, హీరా ఫెరి లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ కార్యక్రమంలో సునీల్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన తొలి సినిమా విడుదలైన తర్వాత కొందరు తన గురించి చాలా దారుణంగా రాసారని.... నేను చెక్క మొద్దులా ఉన్నానని, సినిమాలకు పనికి రాడని, హావ భావాలు సరిగా పలికించడం రాదని, సినిమాలు వదిలేసి తిరిగి రెస్టారెంట్ బిజినెస్ లోకి వెళ్లడం బెటర్ అంటూ విమర్శించారని గుర్తు చేసుకున్నారు.

నేను ఇక్కడే ఉన్నా, నా గురించి రాసినవారెక్కడ?

నేను ఇక్కడే ఉన్నా, నా గురించి రాసినవారెక్కడ?

అప్పట్లో నాపై ఇలాంటి వార్తలు రావడంతో బాధ పడ్డాను. దాంతో మరింత కష్టపడాలనే కసి పెరిగింది. 26 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను, మరి నా గురించి అలా రాసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు అని సునీల్ శెట్టి అన్నారు.

ఇప్పటికీ విద్యార్థినే

ఇప్పటికీ విద్యార్థినే

తాను ఇఫ్పటికీ ప్రతిరోజూ కెమెరా ముందుకు విద్యార్థిలా వెళ్తానని, కెమెరా ముందుకు వెళ్లాక నేర్చుకునేది చాలా ఉంటుంది, ప్రతి రోజూ కొత్త విషయాలు ఉంటాయని, ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాను, అలా అయితేనే ఈ రంగంలో ముందుకు సాగుతామని సునీల్ శెట్టి అన్నారు.

యాక్టింగ్ అడ్డా

యాక్టింగ్ అడ్డా

టాటా స్కై డీటీహెచ్ వారు యాక్టింగ్ లెస్సన్స్ నేర్పే ఛానల్ ‘యాక్టింగ్ అడ్డా' ఒకటి లాంచ్ చేసారు. ఈ సందర్భంగా తాను నటుడిగా తొలి నాళ్లలో ఎదుర్కొన్న విమర్శలను సునీల్ శెట్టి గుర్తు చేసుకున్నారు.

డబ్బు అవసరం లేదు, టాలెంట్ ఉంటే చాలు

డబ్బు అవసరం లేదు, టాలెంట్ ఉంటే చాలు

నటనా రంగంలో రాణించాలనుకునే వారికి డబ్బు అవసరం లేదు, యాక్టింగ్ టాలెంట్ ఉంటే చాలు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఈ రంగంలో అభిస్తాయని సునీల్ శెట్టి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సునీల్ శెట్టితో పాటు అజయ్ దేవగన్ కూడా పాల్గొన్నారు.

English summary
My first film released and the title (given to me) was 'wooden', 'lakda', 'can't act', 'he should go back to the restaurant business'. After 26 years, I am still here. The person who wrote it, (I) don't know where he is (now)," tSuniel Shetty told PTI in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu