Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Finance
సెబి షాకింగ్: HDFCకి భారీ జరిమానా, షేర్లు పతనం
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విలన్ వేషాలేస్తా, చిరంజీవి దారిలో నడుస్తా: హీరో సునీల్
సునీల్ హీరోగా బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఏ టీవీ సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. ఈ సినిమా అక్టోబర్ 7న విజయదశమి కానుకగా గ్రాండ్ర్ రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. అందుకు సంబంధించిన విశేషాలపై ఓ లుక్కేయండి.

భిన్నంగా ఉంటుంది
నేను చేసిన అందాల రాముడు, పూలరంగడు, భీమవరం భుల్లోడు, జక్కన్న ఈ సినిమాలకు భిన్నంగా ‘ఈడు గోల్డ్ ఎహె' సాగుతుంది. మర్యాదరామన్న సినిమా తరహాలో ఓ ఎగ్జయిట్‌మెంట్‌తో సాగే చిత్రమని సునీల్ తెలిపారు. సినిమా చూస్తున్నంత సేపు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మర్యాద రామన్న సినిమాలో చివరి వరకు ఏమౌతుందనే సస్పెన్స్ ఉంటుందో అలాంటి సస్పెన్స్ ఈ సినిమాలో కూడా చివరకు వరకు కొనసాగుతుందన్నారు.

త్రివిక్రమ్ తో ఒకే రూంలో ఉన్న సమయంలో...
నేను, త్రివిక్రమ్ ఒక రూంలో ఉండే సమయంలో వీరుపోట్ల, గోపీమోహన్ అందరూ మంచి ఫ్రెండ్స్. ఆ సమయంలో వీరుపోట్లవారికి రూం కూడా నేనే చూసి పెట్టాను. అప్పటి నుండి మా మధ్య పరిచయం ఉంది. త్రివిక్రమ్ దర్శకుడు అయిన తర్వాత నాకు బ్రేక్ ఇస్తే ఇప్పుడు వీరుపోట్ల నాకు ఈడు గోల్డ్ ఎహేతో మరో మంచి బ్రేక్ ఇవ్వబోతున్నాడు అని సునీల్ తెలిపారు.

తన పాత్ర గురించి
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు బంగార్రాజు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్. ఇందులో డబుల్ షేడ్ ఉన్న రోల్ పోషించాను. నేను ఇప్పటి వరకు చేయని యాంగిల్‌ను ఈ సినిమాలో చూడబోతున్నారు. వీరుపోట్ల ఈ కథను నన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాడు. అయితే స్క్రిప్ట్ చాలా బలంగా రాసుకున్నాడు. ఈ కథ నాకే కాదు.., ఎవరికైనా సూట్ అవుతుందని తెలిపారు.

రాబిన్ హుడ్ పాత్ర కాదు
ఈ సినిమాలో మాస్క్ వేసుకుని కనిపించడానికి కారణం కొన్ని సమస్యల నుండి తప్పించుకుని తిరగడానికే తప్ప రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనపడను. సినిమాలో అన్నీ రకాల ఎలిమెంట్స ఉంటాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాను చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు.

విలన్ వేషాలేస్తా
వాస్తవానికి తాను తెలుగు ఇండస్ట్రీలోకి విలన్ కావాలనుకుని వచ్చాను. పరిస్థితులు నన్ను కమెడియన్ గా మార్చాయి. ఇప్పుడు హీరో అయ్యాను. విలన్ గా కూడా చేసే ఆలోచన ఉంది. కానీ ముందు వేరే భాషా చిత్రాల్లో విలన్ గా నటిస్తాను. వచ్చే ఏడాది వేరే భాషా చిత్రాల్లో విలన్ గా కనపడే అవకాశాలున్నాయి అన్నారు సునీల్.

చిరంజీవి గారి దారిలో నడుస్తాను
నటుడిగా నాకు చిరంజీవి గారే ఇన్స్‌స్పిరేషన్. ఆయన దారిలో నడుస్తూ ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని ఉంది. వచ్చే ఏడాది ఓ స్వచ్ఛంద సంస్థ మొదలు పెట్టలాలనుకుంటున్నాను. మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లలకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని సునీల్ తెలిపారు.

చిరు 150లో అడిగారు కానీ...
చిరంజీవి 150వ సినిమాలో యాక్ట్ చేయమని అడిగారు. అయితే అప్పటికే ఈడు గోల్డ్ ఎహే సినిమాకు డేట్స్ ఇచ్చేసి ఉండటం వల్ల కుదరలేదు. అయితే చిరంజీవిగారి సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను. అయితే నాకు ఇంతకు వచ్చిన ఆపర్ వచ్చిన రోల్ లో కాకుండా వేరే రోల్ చేస్తున్నాను అని సునీల్ తెలిపారు.

కులం వల్లే ఎదిగావా? అన్నారు, చంపేస్తానన్నా: హీరో సునీల్ వివరణ
కులం వల్లే ఎదిగావా? అన్నారు, చంపేస్తానన్నా: హీరో సునీల్ వివరణ....పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి