»   » ‘గల్ఫ్‌’కు సర్కార్ పన్ను మినహాయింపు ఇవ్వాలి.. బాధితుల్లో తెలంగాణ వారే.. సునీల్ కుమార్ రెడ్డి

‘గల్ఫ్‌’కు సర్కార్ పన్ను మినహాయింపు ఇవ్వాలి.. బాధితుల్లో తెలంగాణ వారే.. సునీల్ కుమార్ రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gulf Movie Official Trailer గల్ఫ్ సినిమా ట్రైలర్

పలు సామాజిక చిత్రాలు రూపొందించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'గల్ఫ్‌'. చేతన్‌ మద్దినేని, హయాతీ జంటగా నటించారు. శ్రావ్య ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ 'గల్ఫ్‌' విశేషాలు తెలిపారు.

గల్ఫ్‌లో భారతీయుల కష్టాలు

గల్ఫ్‌లో భారతీయుల కష్టాలు

దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ...'శ్రావ్య ఫిలింస్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 16వ చిత్రమిది. గల్ఫ్‌ బాధితుల కష్టాలనే ఇతివృత్తంగా తీసుకుని రూపొందించాను. ప్రేమ కథ నేపథ్యంగా సాగుతూ పొట్ట చేతపట్టుకొని పనికోసం గల్ఫ్‌కు వెళ్లిన భారతీయుల కష్టాలను చూపిస్తున్నాం. పురుషులు చేయని తప్పులకు జైలు శిక్షలు అనుభవిస్తన్నారు. మహిళలు శారీరక హింస, లైంగిక దాడులకు గురవుతున్నారు. ఇంత పెద్ద సమస్యపై ఇప్పటిదాకా ఎవరూ సినిమా చేయలేదు. మేము వారి కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించాం అని అన్నారు.

బాధితుల కష్టాలను ఇతివృత్తంగా

బాధితుల కష్టాలను ఇతివృత్తంగా

గల్ఫ్‌ బాధితుల సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గల్ప్‌ చిత్రాన్ని తెరకెక్కించాం. గల్ఫ్‌ కార్మికుల వల్ల దాదాపు రూ.30 వేల కోట్లు విదేశీ మారకద్రవ్యం దేశానికి వస్తున్నది. మా సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న ఆవేదన గల్ఫ్ కార్మికుల్లో కనిపిస్తోంది.

గల్ఫ్ బాధితుల్లో సిరిసిల్ల వారే..

గల్ఫ్ బాధితుల్లో సిరిసిల్ల వారే..

గల్ఫ్‌కి వలస వెళ్లిన వారిలో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకి చెందిన వారెక్కువగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి జిల్లా కూడా అదే. ఆయన ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. ఓ మంచి ఉద్దేశంతో తెరకెక్కించిన ఈ చిత్రానికి వినోదపు పన్నులో మినహాయింపుని ఇవ్వాలని కోరుతున్నాం అని సునీల్ కుమార్ రెడ్డి అన్నారు.

యూఎస్‌లో గ్రాండ్‌గా రిలీజ్

యూఎస్‌లో గ్రాండ్‌గా రిలీజ్

అమెరికా, కెన్యా, ఆస్ట్రేలియాల్లోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. అమెరికాలో గల్ఫ్ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడం గమనార్హం. జార్జియాలోని డిజ్‌మ్యాక్స్ థియేటర్‌లో, కాలిఫోర్నియాలోని సెర్రా థియేటర్, ఇల్లినాయిస్‌లో మూవీ మ్యాక్స్ సినిమా, వర్జీనియాలో డీసీ సినిమా, డల్లాస్‌లో వెనెటియన్ సినిమాస్, ఫ్లోరిడాలో టౌన్3, ఎడిసన్‌లో 8కే సినిమాస్, ఓహియోలో స్క్రీన్స్ ఎట్ ది కంటినెంట్ హాల్స్‌లో రిలీజ్ అవుతున్నది.

English summary
Gulf Movie is releasing on October 13th. This movie is directed by P Sunil Kumar Reddy. This movie story is inspired by the Gulf Victims. On the eve of Gulf release, Sunil Kumar Reddy speaks to media. He said that most of the gulf victim are from Sircilla of Telangana. So Goverment should give tax excemption to the Gulf movie, He requested.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu