»   »  ‘జక్కన్న’గా రాబోతున్న సునీల్, సిక్స్ ప్యాక్ కూడా..

‘జక్కన్న’గా రాబోతున్న సునీల్, సిక్స్ ప్యాక్ కూడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ గురించి తెలిసిన వారెవరైనా...జక్కన్న ఎవరంటే టక్కున దర్శకుడు రాజమౌళి పేరు చెబుతారు. అపజయాలు ఎరుగని దర్శకుడు, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా పర్‌ఫెక్టుగా సినిమా తీస్తాడని జూ ఎన్టీఆర్...రాజమౌళిని అలా పిలవడం మొదలు పెట్టడం, ఆ పేరే పాపులర్ కావడం తెలిసిందే. అయితే ఇకపై జక్కన్న అంటే సునీల్ అని అంటారేమో? అందుకు కారణంగా ‘జక్కన్న' పేరుతో సునీల్ సినిమా వస్తుండటమే.

దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల తన తాజా చిత్రానికి ‘జక్కన్న' అనే పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం సునీల్ కథానాయకుడిగా వంశీకృష్ణ ఆకెళ్ల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా... సునీల్ సరసన రొమాన్స్ చేస్తోంది. ప్రేమకథా చిత్రమ్ ఫేమ్ సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sunil Next Movie Titled as Jakkanna

గతంలో పూల రంగడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ మరోసారి ‘జక్కన్న'లో కూడా అలా కనిపించబోతున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాకు అగ్గిపుల్ల, సైనికుడు అనే టైటిల్స్‌ను పరిశీలించారు. అయితే చివరగా ‘జక్కన్న' టైటిల్ ఖారు చేసినట్లు సమాచరాం.

సినిమా కథ కూడా జక్కన్న అనే టైటిల్‌కి యాప్ట్ అయ్యే విధంగా ఉండటం, రాజమౌళి నిక్ నేమ్ కావడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే టైటిల్ విషయమై అపీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

English summary
Comedian turned hero Sunil has collaborated with director Vamsi Krishna Akella of Raksha fame for a new project. The film also stars Bollywood actor Priyanka Chopra’s cousin Mannara Chopra as the leading lady. According to our well-placed sources, the makers have finalised Jakkanna as the film’s title.
Please Wait while comments are loading...