»   » గీతా ఆర్ట్స్ తో పంచ్ : సునీల్ ‘జక్కన్న’ టీజర్ (వీడియో)

గీతా ఆర్ట్స్ తో పంచ్ : సునీల్ ‘జక్కన్న’ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నీకు మార్షిల్ ఆర్ట్స్ తెలుసా...అంటూ సప్తగిరి అంటే ..నీకు గీతా ఆర్ట్స్ తెలుసా అంటూ సునీల్ చెప్పే ఫన్ టీజర్ ని ఫస్ట్ లుక్ టీజర్ గా జక్కన్న చిత్రానికి విడుదల చేసారు. 30 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్ లో కేవలం సప్తగిరి, సునీల్ ల మధ్య ఒక్క డైలాగ్ మాత్రమే పొందుపరిచారు. 

సునీల్, మన్నరా చోప్రా జంటగా నటిస్తున్న చిత్రం జక్కన్న. వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.

sunil

నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...... "సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. ఈ చిత్రానికి జక్కన్న అనే టైటిల్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది. డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు.

ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అందరినీ అలరిస్తుంది.అంటూ చెప్పారు. ఇదివరలో వచ్చిన ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులుంటాయో ఇప్పుడ్డు జక్కన్న లో కూడా అన్ని ట్విస్టులుంటాయనీ చెప్పారు..

ఆర్‌పి‌ఏ క్రియేషన్స్ పతాకం పై సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దినేష్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ చిత్రం జూలై నెలాఖరులో కానీ ఆగష్టు లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈడు గోల్డ్ ఎహే చిత్రంలోనూ సునీల్ నటిస్తున్నాడు.

గతంలో పూల రంగడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ మరోసారి 'జక్కన్న'లో కూడా అలా కనిపించబోతున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాకు అగ్గిపుల్ల, సైనికుడు అనే టైటిల్స్‌ను పరిశీలించారు. అయితే చివరగా 'జక్కన్న' టైటిల్ ఖారు చేసారు. సినిమా కథ కూడా జక్కన్న అనే టైటిల్‌కి యాప్ట్ అయ్యే విధంగా ఉండటం, రాజమౌళి నిక్ నేమ్ కావడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.

English summary
Jakkanna is an upcoming Telugu film of 2016. Vamsi Akella, is the director of the movie. Cousin of Bollywood heroine Priyanka chopra i.e Mannara is reportedly romancing with Sunil in this movie. The action entertainer movie is produced by Prema Katha Chitram fame Sudarshan Reddy on RPA Creations banner .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu