»   »  సునిల్ 'కృష్ణాష్టమి' క్రిస్మస్ గిఫ్ట్

సునిల్ 'కృష్ణాష్టమి' క్రిస్మస్ గిఫ్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సునీల్‌, డింపుల్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా 'కృష్ణాష్టమి'. వాసువర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన గిఫ్ట్ ఒకటి క్రిస్మస్ కి అందించాలని అనుకుంటోంది.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రోమె సాంగ్ ను ఉదయం 10:30 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనికి మ్యూజిక్ డైరక్టర్ దినేష్. ఈ సినిమా ఆడియో కార్యక్రమం డిసెంబర్ 27న, సినిమాని ఫిబ్రవరి 4న విడుదల చేస్తారని సమాచారం.

నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ ను సమకూర్చారు.
ఈ చిత్ర దర్శకుడు వాసువర్మ ఇంతకుముందు నాగచైతన్య హీరోగా జోష్‌ చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఫెయిలైంది. దాంతో ఆయన ఈ చిత్రంపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు.

Sunil's krishnastami promo song on X-mas day

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫామిలీ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

దర్శకత్వం - స్క్రీన్‌ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

English summary
Krishnastami filmmakers will be releasing promo song at 10:30 am on December 25. Dinesh is making his debut as music director for the film produced by Dil Raju on Sri Venkateswara Creations banner. Film's audio will be released on Dec 27 and film on Feb 4 in a grand manner.
Please Wait while comments are loading...