»   »  సునీల్‌ కొత్త చిత్రం 'కృష్ణాష్టమి' టీజర్ (వీడియో)

సునీల్‌ కొత్త చిత్రం 'కృష్ణాష్టమి' టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా సునీల్‌ హీరోగాగా నటిస్తున్న 'కృష్ణాష్టమి' చిత్రం టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వాసువర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నటుడు సునీల్‌ తెలిపారు.వాసువర్మ ఇంతకుముందు నాగచైతన్య హీరోగా జోష్‌ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ ను సమకూర్చారు.

Sunil's New movie Krishnashtami Teaser

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

దర్శకత్వం - స్క్రీన్‌ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

English summary
Sunil's Krishnashtami Teaser. Directed by Vasu Varma. Produced by Dil Raju. Music by Dinesh. Starring: Sunil, Nikki Galrani, Dimple Chopade, Brahmanandam, Ashutosh Rana, Mukesh Rishi, Posani Krishna Murali, Suman, Sapthagiri, Pavithra Lokesh and Tulasi among others.
Please Wait while comments are loading...