»   » చిరంజివి కి నో చెప్పిన సునీల్ : కారణం అదేనా..??

చిరంజివి కి నో చెప్పిన సునీల్ : కారణం అదేనా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి 150వ సినిమాగా "కత్తిలాంటోడు" సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిర్మాతగా చరణ్ .. దర్శకుడిగా వినాయక్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవికి స్నేహితుడి పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్రకి సునీల్ అయితేనే కరెక్ట్ అనుకుని కొన్ని రోజుల క్రితం ఆయనని సంప్రదిస్తే ఆనందంతో ఒప్పేసుకున్నాడని అప్పట్లో ఒక వార్త కూడా వినిపించింది.

అయితే ఇప్పుడు చిరు సినిమా కి సునీల్ నో చెప్పాడన్న వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్త విన్న వారందరూ సునీల్ ఒప్పుకొని మళ్ళీ ఇలా నో చెప్పడమేంటి? అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళాలి కాని కొన్ని అనివార్య కారణాలు వాళ్ళ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది.

chiranjeevi-sunil

తీరా మొదలయ్యే సమయానికి అప్పుడు డేట్లు అనుకున్న నటులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితి సునీల్ ఒక్కడిదే కాదు మరికొందరు నటులు కూడా ఇప్పుడు డేట్లు అడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారట.

అయితే అప్పట్లో సునీల్ దగ్గర కొన్ని డేట్స్ ఉన్నాయి కాని ఇప్పుడు మాత్రం మూడు సినిమాలు చేస్తుండడం వల్ల సునీల్ దగ్గర ఈ చిత్రానికి సరిపడే డేట్స్ లేవట అందుకే చిరు సినిమాకి సారీ చెప్పి తన సినిమాలు చేసుకుంటున్నాడట ఈ కామెడి హీరో.

కమేడియన్ గా సునీల్ అమాయక పాత్రల్లో నటించడం, వెరైటీగా ఉండే డైలాగ్ డెలివరీ, అతని పంచ్ డైలాగ్స్ ఇప్పటికీ చాలామందికి గుర్తున్నాయి. కానీ హీరో అయ్యాక సునీల్ కామెడీ రోల్స్ దాదాపు మానేశాడనే చెప్పాలి. అయినా తన హీరో స్తానాన్ని పక్కన పెట్టి మరీ తన అభిమాన నటుడి పక్కన మళ్ళీ కమేడియన్ గా కనిపించటానికి ఒప్పుకున్న సునీల్ ఇప్పుడు డేట్లు కుదరక సినిమా నుంచి తప్పుకోవటం విచారకరమే అయినా తప్పలేదంటున్నాడట...

ఇప్పుడు సునీల్ ప్లేస్ లో ఎవరైతే బాగుంటుందని అనుకుంటుండగా వెన్నెల కిషోర్ అయితే ఈ పాత్ర కి సూట్ అవతాడని భావించిన యూనిట్ వెన్నెల కిషోర్ ను ఈ పాత్ర కు సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఇలా ఒకటి తరవాత ఒకటిగా 150 వ సినిమాకి అడ్దంకులు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలౌతుందో ఏమో..

English summary
Comedy Hero Sunil says No to Play a Role in Chiru"s 150th Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu