»   » హీరో సునీల్ క్యాన్సర్ పేషెంటా?

హీరో సునీల్ క్యాన్సర్ పేషెంటా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ కమెడియన్‌గా తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సునీల్...ఆ తర్వాత అందాల రాముడు చిత్రంతో హీరోగా పరిచయమై, మర్యాద రామన్నతో తనకంటూ ప్రత్యేకమైన హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు కమెడియన్ పాత్రలు వేయడం మానేసిన సునీల్ పూర్తిగా హీరో పాత్రలు చేయాలని డిసైడ్ అయ్యాడు.

ప్రస్తుతం సునీల్ నటిస్తున్న చిత్రం 'భీమవరం బుల్లోడు'. ఈ చిత్రానికి సంబంధించి ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో సునీల్ క్యాన్సర్ పేషెంటుగా కనిపించబోతున్నారట. గతంలో హీరోలు క్యాన్సర్ పేషెంట్లుగా నటించిన పలు చిత్రాలు హిట్టయిన నేపథ్యంలో....ఈ కాన్సెప్టు కలిసొస్తుందని భావిస్తున్నారు.

సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'పూలరంగడు' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ - అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాగానూ.. 'తడాఖా' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రంగానూ 'భీమవరం బుల్లోడు' వార్తల్లో నిలుస్తోంది.

తనికెళ్ల భరణి, జయప్రకాశ్‌రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, 'అదుర్స్' రఘు, 'సత్యం' రాజేశ్, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు,తాగుబోతు రమేశ్, సామ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్, నిర్మాత: సురేశ్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయశంకర్.

English summary
Comedy Hero Sunil will next be seen in a hilarious entertainer Bheemavaram Bullodu. Now it was said that Sunil will be seen as a ‘cancer patient’ in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu