»   » ఛీఛీ..ఇంత చీప్ గానా: మాజీ హీరోయిన్ పై ఆమె మాజీ భర్త కామెంట్స్, రెస్టారెంట్ లో రచ్చ

ఛీఛీ..ఇంత చీప్ గానా: మాజీ హీరోయిన్ పై ఆమె మాజీ భర్త కామెంట్స్, రెస్టారెంట్ లో రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ప్రఖ్యాత బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌, పారిశ్రామికవేత్త సంజయ్‌ కపూర్‌లు ముంబయిలోని ఒక ఫ్యామిలీ కోర్టు నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. కానీ రీసెంట్ గా ఆమె మాజీ భర్త ఓ రెస్టారెంట్ లో ఆమెను వేరే ఒకనితో చూసి చేసిన రచ్చ ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు ఎక్కింది.

విడిపోయాక..ఎవరు ఎవరితో ఉంటే ఏమిటి, అసలు ఆమె ఎవరితో అక్కడికి వచ్చింది...వంటి విషయాలు పరిగణనలోకి తీసుకోకుండా సంజయ్ కపూర్ క్రియేట్ చేసిన సీన్ ని ముంబై మిర్రర్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. దాంతో బాలీవుడ్ జనం అంతా ఏమిటి..అంత చీప్ గా బిహేవ్ చేసాడా..ఛ..ఛ అంటున్నారు. కరీనానే సపోర్ట్ చేస్తున్నారు.

ముంబై మిర్రర్ పత్రిక ప్రకారం... ''సంజయ్ కపూర్ బ్రిటీష్ క్యాపిటల్ లోని ఓ రెస్టారెంట్ లో తన స్నేహితులతో కలిసి ఉన్నారు. అక్కడకి అతడు ఉన్నాడనే విషయం తెలియని కరిష్మా కపూర్ వచ్చింది. ఆమెతో పాటు ఆమె స్నేహితుడు సందీప్ తోషివాల్ కూడా ఉన్నారు.

వీరిద్దరని చూసిన సంజయ్ కపూర్ నోటి కి వచ్చనట్లు అరుస్తూ , పెద్దగా చప్పట్లు కొడుతూ ఆమెను అవమానించే మాటలు మాట్లాడుతూ సీన్ క్రియోట్ చేసాడు. దాంతో ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు. రెస్టారెంట్ లో అందరి దృష్టి వీరిపైనే పడింది. సంజయ్ స్నేహితులు గట్టిగా పట్టుకుని ఆపేదాకా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అతనేమి కరిష్మా ని వివాహం చేసుకోవటం లేదని, స్నేహితుడే అని చెప్పేదాకా ఆగలేదు. ''

ఇదంతా చూసిన కరిష్మా సిగ్గుతూ కుదించికుపోయిందని తెలుస్తోంది. కాస్సేపటికి ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇది పద్దతి కాదని, ఇలా చీప్ గా బిహేవ్ చేసి, ఆమె పరువు తీయటం మంచి ఆలోచన కాదని, కరిష్మా స్నేహితులు తిట్టిపోస్తున్నారు. ఆమె తండ్రి సైతం మండిపడ్డారు. ఆయనేం అన్నారు క్రింద చదవండి

మిగతా విశేషాలు మీరు స్లైడ్ షో లో చూడవచ్చు.

కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ మాట్లాడుతూ..

కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ మాట్లాడుతూ..

సంజయ్ మంచి వాడు కాదు, వాడో ధర్డ్ క్లాస్ మనిషి, వాడితో వివాహం నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. వాడు భార్యని ఎప్పుడూ సరిగా చూడలేదు. వేరే ఆమెతో ఎప్పుడు నుంచో ఉంటున్నాడు. డిల్లీ మొత్తం ఈ విషయం తెలుసు. దీని గురించి ఎక్కువ చెప్పటం అనవసరం అన్నారు.

పెళ్లైన కొంత కాలానికే...

పెళ్లైన కొంత కాలానికే...

2003లో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట కొద్ది సంవత్సరాల తరువాత విభేదాలతో దూరమైంది.

ముంబై మకాం మార్చాక

ముంబై మకాం మార్చాక

కరిష్మా 2010లో సంజయ్‌కు దూరమై ముంబయికి మకాం మార్చారు. 2014లో విడాకులు తీసుకోవాలని పరస్పరం నిర్ణయించుకుని న్యాయస్థానానికి దరఖాస్తు చేసి తీసుకున్నారు.

అంతకు ముందు ఓ సారి

అంతకు ముందు ఓ సారి

తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ..భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సంజయ్‌కపూర్, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

కేసు కూడా పెట్టారు

కేసు కూడా పెట్టారు

కరిష్మా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు సంజయ్‌కపూర్, అతని తల్లి రాణి సురీందర్ కపూర్పై సెక్షన్ 498ఏ, 34కింద కేసు నమోదు చేశారు.

విడాకుల ముందే ఐదేళ్లు

విడాకుల ముందే ఐదేళ్లు

కరిష్మ, సంజయ్ కపూర్ మధ్య మనస్పర్థలు రావడంతో వీరు విడాకులకు ముందు ఐయిదేళ్లుగా విడిగా ఉన్నారు. మరోవైపు కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ భర్త సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

బ్రేక్ అప్ అయ్యాకే

బ్రేక్ అప్ అయ్యాకే

కరిష్మా కపూర్ నన్ను పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమే అంటూ తన పిటీషన్లో పేర్కొన్నాడు. గ్లామరస్ లైఫ్ స్టైల్ కోసం వెంపర్లాడేదని, అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌తో బ్రేకప్ అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుని రీబౌండ్ అయిందంటూ పేర్కొన్నాడు.

పావులుగా..

పావులుగా..

పిల్లలను తనతో కలవకుండా చేస్తోందని, విడాకుల కేసులో వారిని పావులుగా వాడుకుంటోందని పిటీషన్లో పేర్కొన్నారు

ఫెయిలైంది

ఫెయిలైంది

కరిష్మా కపూర్..... నాకు భార్యగా, నా తల్లిదండ్రులకి కోడలిగానే కాదు, తల్లిగా కూడా ఫెయిల్ అయిందంటూ సంజయ్ కపూర్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

మాఫియా బెదిరింపులు

మాఫియా బెదిరింపులు

విడాకుల కేసు విషయమై తనకు సంజయ్ నుంచి మాఫియానుంచి బెదిరింపులు సైతం వచ్చాయంది.

English summary
Sunjay Kapur and Karisma Kapoor are no longer together. But it seems like Sunjay has still not moved on. He created a scene at a restaurant when he saw his ex-wife with some other guy.
Please Wait while comments are loading...