»   » ఉన్న మార్కెట్ ఏమిటీ..పెట్టే బడ్జెట్ ఏమిటీ.., రాజశేఖర్ కోసం సన్నీ లియోనా..!?

ఉన్న మార్కెట్ ఏమిటీ..పెట్టే బడ్జెట్ ఏమిటీ.., రాజశేఖర్ కోసం సన్నీ లియోనా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు స్టార్ హీరోల కేటగిరీలో కొనసాగిన హీరోలు ఆ తర్వాత ఆ టాగ్ లైన్ ను వదులుకోలేక, అలా అని హిట్స్ కొట్టలేక సతమతం అవుతుంటారు. పోనీ జగపతిబాబు, అర్జున్ లాంటి సీనియర్ల తరహాలో క్యారెక్టర్ రోల్స్ కు కూడా షిఫ్ట్ అవ్వలేరు. నిజాన్ని జీర్నించుకోవటానికి ఒప్పుకోరు. దాదాపు రాజశెఖర్ పరిస్థితి ఇలాగే ఉంది.

పీఎస్వీ గరుడవేగ

పీఎస్వీ గరుడవేగ

ఆయన మార్కెట్ చతికిలబడి దాదాపు పదేళ్ళు దగ్గర పడుతోంది.. పదేళ్ళలో యావరేజ్ దాటి ఆడిన సినిమా ఒక్కటి కూడా లేదు అన్నిటిలోకీ బెటర్ అనిపించుకున్నది "ఎవడైతే నాకేంటీ" మాత్రమే ఆతర్వాత వచ్చినవన్నీ ఆల్మోస్ట్ డిజాస్టర్లే అయినా రాజశేఖర్ కి ఇంకా హీరో గానే కొనసాగాలన్న కోరిక పోలేదు...

టైటిల్ వెరైటీగా ఉంది

టైటిల్ వెరైటీగా ఉంది

అందుకే పీఎస్వీ గరుడవేగ మొదలు పెట్టాడు టైటిల్ వెరైటీగా ఉంది కాబట్టి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సినిమా కూడా అంతే కొత్తగా ఉంటే మాత్రం నలుగుర్నీ ఆకర్షిస్తుంది. కానీ రాజ శేఖర్ కిమాత్రం పెద్దగా కలిసొచ్చేదేముండదు. ఎందుకంటే రాజశేఖర్ కి ఉన్న మార్కెట్ అంతంతమాత్రమే.

భారీగా ఖర్చుపెట్టి తీస్తున్న మూవీ

భారీగా ఖర్చుపెట్టి తీస్తున్న మూవీ

ప్రస్తుత మార్కెట్ కు సంబంధం లేకుండా భారీగా ఖర్చుపెట్టి తీస్తున్న మూవీ గరుడ వేగ నే. ఫారిన్ షూటింగ్ వలన ఈ సినిమా కోసం ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కంటే ఓ రెండు కోట్లు ఎక్కువైందని ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం మరింత పెట్టేస్తున్నారు.

 హైప్ రావాలంటే

హైప్ రావాలంటే

అయితే దర్శకుడు ప్రవీన్ సత్తారు కి ఈ విషయం లో కొంచం క్లారిటీ ఉన్నట్టుంది అందుకే రాజశేఖర్ స్టార్ డమ్ మీద మాత్రమే ఆధారపడకుండా అదనపు హంగులు కలుపుతున్నాడు. సినిమాకు హైప్ రావాలంటే ఖచ్చితంగా పేరొందిన స్టార్లు ఉండాలి. అందుకే ఈ సినిమాలో సన్ని లియోన్ తో ఒక ఐటెం సాంగ్ చేయిస్తున్నారు.

సన్నీకి అర కోటి

సన్నీకి అర కోటి

ప్రస్తుతం ఈ పాట షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. అయితే ఈ పాట కోసం ఆల్రెడీ సన్నీకి అర కోటి చెల్లించగా.. పాటకు పనిచేసే కొరియోగ్రాఫర్లకు ఫ్యాషన్ డిజైనర్ కు కూడా ఎక్కువగానే చెల్లిస్తున్నారట. ఆ మధ్యన రామ్-లీల సినిమాలో ప్రియాంక చోప్రా చేసిన ఐటెం సాంగ్ లో గ్లామరసం ఆరబోయించిన కొరియోగ్రాఫర్ విష్ణు దేవా.. ఇప్పుడు సన్ని తో స్టెప్పులేయిస్తున్నాడు.

ఏదన్నా అటూ ఇటూ అయ్యిందంటే

ఏదన్నా అటూ ఇటూ అయ్యిందంటే

వీరందరికీ అయ్యే ఖర్చు తడసి మోపెడు అయ్యిందట. మరి ఇప్పుడు ఇంత ఖర్చూ రేపు బాక్సాఫీస్ లో పోగవుతుందా అన్నదే ప్రశ్న. పాపం ప్రవీణ్ సత్తారు మొదటి సినిమా గుంటూర్ టాకీస్ బాగానే ఆడినా "బూతుల వల్ల లాక్కొచ్చాడు" అన్న అపప్రద మిగిలిపోయింది. ఈ సినిమాతో ఆ మార్క్ పోగొట్టుకుందాం అన్న ఆలోచనలో ఉన్నడు. కానీ ఫలితం ఏదన్నా అటూ ఇటూ అయ్యిందంటే మాత్రం ఉన్న పేరుకూడా పోయే ప్రమాదం ఉంది....

English summary
The special song starring Sunny Leone in actor Rajasekhar and director Praveen Sattaru’s next PS Garuda Vega, will be shot in Hyderabad and Mumbai. An expensive set has been designed for the song
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu