»   » సన్నీ లియోన్ కంటే వెనకపడ్డ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

సన్నీ లియోన్ కంటే వెనకపడ్డ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2015వ సంవత్సరం ముగింపు కావడంతో ఈ సంవత్సరానికి సంబంధించి గూగుల్ పలు వివరాలు వెల్లడించింది. హైదరాబాద్ లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్‌ చేసిన వివరాలను గురువారం విడుదల చేసింది. సినిమా స్టార్లు, సినిమాలు, స్థలాలు ఇలా వివిధ అంశాల్లో హైదరాబాదీలు దేనిపై ఆసక్తి చూపారు అనే వివరాలు వెల్లడించింది.

సెలబ్రిటీల్లో హైదరాబాదీలు ఎవరి గురించి బాగా వెతికారో తెలిస్తే షాకవ్వక మానరు. మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ నటి సన్నీ లియోన్ గురించి హైదరాబాదీలు ఎక్కువగా వెతికారు. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ చాలా వునకబడి ఉన్నారు. సన్నీ లియోన్ తర్వాతి స్థానాల్లో వరుసగా కాజల్, అనుష్క, ప్రభాస్, అబ్దుల్ కలాం, సమంత, సల్మాన్, మహేష్ బాబు, ఇమ్రాన్ హస్మి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఉన్నారు.

Sunny Leone most searched celebrity

ఇక సినిమాల విషయానికొస్తే 'బాహుబలి' గురించే ఎక్కువ మంది సెర్చ్ చేసారు. ఈ లిస్టులో ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన 'శ్రీమంతుడు' సినివూ పదో స్థానంలో నిలిచింది. ఇదంతా సరేకానీ....సన్నీ లియోన్ పై హైదరాబాదీలు ఇంత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారంటే.....ఆమె నటించిన బూతు సినిమాల కోసం తహతహలాడిపోతున్నట్లు స్పష్టమవుతోంది.

English summary
Bollywood actress Sunny Leone most searched celebrity in google Hyderabad search.
Please Wait while comments are loading...