»   » ప్రియాంక, మోదీ వివాదంపై సన్నిలియోన్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రియాంక, మోదీ వివాదంపై సన్నిలియోన్ సెన్సేషనల్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా కలుసుకోవడం వివాదాస్పదమైంది. బెర్లిన్‌లో మోదీతో జరిగిన భేటీలో ప్రియాంక అసభ్యకరంగా దుస్తులు ధరించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. తొడలు కనిపించే విధంగా కూర్చున ప్రియాంక తీరును సోషల్ మీడియాను నెటిజన్లు తప్పుపట్టారు. ఆ విమర్శలకు ప్రియాంక కూడా సమాధానం ఇచ్చింది. అలా వివాదం సద్దుమణుగుతున్న సమయంలో తాజాగా సెక్స్‌బాంబ్ సన్నిలియోన్ ఆ వివాదంపై స్పందించడం చర్చనీయాంశమైంది.

స్పందించిన ప్రియాంక

స్పందించిన ప్రియాంక

ఈ వివాదంపై ప్రియాంక వెంటనే స్పందిచారు. తన తల్లి వద్ద కూడా తాను అలానే ఉంటాను అని అన్నారు. తల్లి మధు చోప్రాతో కలిసి ఉన్న ఫోటోను కూడా ప్రియాంక పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వరుణ్ ధావన్‌తోపాటు పలువురు బాలీవుడ్ నటులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

సన్నిలియోన్ మద్దతు

సన్నిలియోన్ మద్దతు

ముంబైలో జరిగిన ఓ సమావేశంలో సన్నిలియోన్ మాట్లాడుతూ.. అత్యంత హుందాతనం ఉన్న వ్యక్తిని భారత ప్రధానిగా ఎన్నుకొన్నాం. ఆయన ఏ విషయంపైనైనా నిక్కచ్చిగా మాట్లాడుతారు. కుండ బద్దలు కొట్టినట్టు చెపుతారు. ప్రియాంక వ్యవహారంలో ఆయనకు ఏదైనా సమస్య ఉంటే ఆమెకు నేరుగా చెప్తాడు. కానీ అలా మోదీ చేయలేదు అని అన్నారు.

దుస్తులతో అంచనా వెయ్యొద్దు

దుస్తులతో అంచనా వెయ్యొద్దు

ప్రియాంక సమాజానికి ఎంత సేవ చేస్తుందో నాకు తెలుసు. ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. అలాంటి వ్యక్తిని ధరించిన దుస్తులతో కాకుండా చేసే పనులతో వ్యక్తిత్వాన్ని చూడాలి అని ప్రియాంకకు సన్నిలియోన్ బాసటగా నిలిచారు.

నేను ఏమైనా ప్రధానినా?

నేను ఏమైనా ప్రధానినా?

అయితే ప్రియాంక, మోదీ వివాదంపై స్పందించానికి బిగ్ బీ అమితాబ్ నిరాకరించాడు. ఈ విషయంపై స్పందించాలని మీడియా కోరగా ఈ వివాదంపై స్పందించడానికి నేను ప్రధాని కాను అలా అని ప్రియాంక చోప్రాను కూడా కాదు. ఈ వివాదంపై స్పందించాడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని బిగ్ బీ స్పష్టం చేశాడు.

English summary
Sunny Leone defended Priyanka Chopra's choice of dress while meeting Prime Minister Narendra Modi. Sunny Leone saying that, I believe that we have elected a very smart man to be the Prime Minister of India. He is so smart, so intelligent and so outspoken that if he had a problem with it (Priyanka wearing a short dress) he would tell Priyanka. But he didn't.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu