»   » తెలుగు తెరపై సన్నిలియోన్ ...డిటేల్స్

తెలుగు తెరపై సన్నిలియోన్ ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఫోర్న్ స్టార్ సన్నిలియోన్ అంటే తెలియని వారు లేరు. అంతలా ఆమె ఇండియాలో క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకోవటానికి తెలుగు నిర్మాతలు తమ సినిమాల్లో నటించమని చాలా ఆపర్స్ ఆమె ఎదురుగా పెట్టారు. అయితే ఆమె వాటిలో వేటినీ ఓకే చేయక పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి పెడుతూ వచ్చింది. అయితే తాజాగా ఆమె చేస్తున్న చిత్రం తెలుగు,తమిళ, హిందీభాషల్లో ఒకేసారి విడుదల కానుందని సమాచారం.


తమిళ హీరో భరత్ తో కలిసి ఆమె కత్రినా కైఫ్ ని బూమ్ చిత్రంతో పరిచయం చేసిన కైజాద్ గుస్తాద్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైంది. తమిళ,తెలుగు భాషల్లో ఆ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఆ చిత్రం టైటిల్ జాక్ పాట్. ఈ విషయాన్ని హీరో భరత్ సైతం ఖరారు చేసారు.

భరత్ ట్వీట్ చేస్తూ... " నిజమే... మేం గోవాలో మా చిత్రం షూటింగ్ మొదలు పెట్టాం. నా మొదటి హిందీ చిత్రం టైటిల్ " జాక్ పాట్". చిత్రాన్ని కైజాద్ గుస్తాద్ డైరక్ట్ చేస్తున్నారు. చిత్రంలో నసీరుద్దిన్ షా, సన్నిలియాన్, శర్మన్ జోషి వంటి నటులు కనిపించనున్నారు. ఇది ఓ కామిడీ థ్రిల్లర్. ఈ చిత్రంలో నేను ఓ కొత్త లుక్ తో కనిపిస్తాను ". అని ట్వీట్ చేసారు. సన్నిలియోన్ సైతం ఈ చిత్రంలో నటించటం తనకు చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్ చేసింది.

English summary
Indian adult film star Sunny Leone will be working with Tamil actor Bharath aka Bharath Niwas for Kaizad Gustad's film Jackpot.
 Bharath tweeted his look from the film to say that he has been signed for the film. Sachin Joshi will also work in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu