ఈ హీరోను గుర్తుపట్టడం కష్టమే: రోడ్డు మీద అప్పడాలు అమ్ముకుంటూ... (వైరల్ ఫోటోస్)
Recommended Video

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అనగానే మనకు కండలు తిరిగిన శరీరం, సూపర్ మ్యాన్ లాంటి కటౌట్ గుర్తుకు వస్తుంది. అయితే ఇపుడు హృతిక్ ఎవరూ గుర్తుపట్టనంతలా మారిపోయి జైపూర్లో సైకిల్ మీద తిరుగుతూ అప్పడాలు అమ్ముకుంటూ కనిపించాడు. అఫ్‌కోర్స్ ఇదంతా సినిమా కోసమే అనుకోండి... అయితే తమ అభిమాన హీరో లుక్ ఇలా ఉండటం చూసి అభిమానులు సైతం షాకవుతున్నారు.

సూపర్ 30
హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘సూపర్ 30' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో భాగంగానే ఆయన జైపూర్ వీధుల్లో సైకిల్ మీద తిరుగుతూ అప్పడాలు అమ్ముతూ కనిపించారు. ఈ చిత్రానికి వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా
ప్రముఖ గణితశాస్త్ర నిపుణుడు, సూపర్ 30 కోచింగ్ సెంటర్ అధినేత ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. టీవీ సోప్ ‘కుంకుమ్ భాగ్య' ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఈ చిత్రంలో హృతిక్ రోషన్ లవ్ ఇంట్రెస్టుగా కనిపించనుంది.

సినిమా స్టోరీ ఏమిటంటే..?
పట్నాకు చెందిన మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్ ఏటా ఆర్థికంగా వెనుకబడిన 30 మంది విద్యార్థులకు ఐఐటీ పరీక్ష రాయడానికి శిక్షణ ఇస్తుంటారు. దీని వల్ల పేదరికంలో ఉన్న ప్రతిభగల విద్యార్థుల జీవితాలు ఎలా మారిపోయాయి అనే పాయింటును ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది.

ఫోటోస్ వైరల్
‘సూపర్ 30' సినిమాకు సంబంధించి హృతిక్ రోషన్ ఫోటోస్ ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఇప్పటికే ‘కాబిల్' చిత్రంలో అంధుడిగా నటించిన హృతిక్ ఇపుడు సూపర్ 30లో ఎలాంటి గ్లామర్ లేకుండా కనిపిస్తూ ప్రయోగానికి సిద్ధం కావడం సాహసమే.

సినిమా రిలీజ్ ఎప్పుడు?
‘సూపర్ 30' మూవీని 2019 జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











