»   » సూపర్ స్టార్ కృష్ణకు ఏమైంది?

సూపర్ స్టార్ కృష్ణకు ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Super star Krishna health issue in talk
హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా?.... ఆయన్ను చూసిన వారంతా ఇలాంటి అనుమానమే వ్యక్తం చేస్తున్నారు. 70 సంవత్సరాల వయసున్న ఆయన ఇటీవల తన అల్లుడు సుధీర్ బాబు నటించిన 'ఆడు మగాడ్రా బుజ్జి' ప్రీమియర్‌షోకు హాజరైన సందర్భంగా కాస్త బలహీనంగా కనిపించారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

సినిమాల్లో యాక్టివ్‌గా లేక పోయినా పలు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ.....అప్పుడప్పుడూ వెండితెరపై తళుక్కుమంటున్నారు సూపర్ స్టార్. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సహకరించక పోవడం కారణంగానే పలు ఆఫర్లను తిరస్కరించారని టాక్. కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్-వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలో ఓ పాత్ర కోసం ఆయన్ను సంప్రదించగా నో చెప్పారని, దాని వెనక అసలు కారణం అదే అని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ మన సూపర్ స్టార్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిద్దాం.

కృష్ణ తనయుడు మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధికంగా సంపాదించే హీరో మహేష్ బాబే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన '1' చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. ఈచిత్రం ద్వారా కృష్ణ మనవడు గౌతంకృష్ణ తెరంగ్రేటం చేయబోతుండటం గమనార్మం.

ఇక ఇటీవల 'ఎస్ఎంఎస్' చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన కృష్ణ అల్లు సుధీర్ బాబు 'ప్రేమ కథా చిత్రమ్'తో హిట్టు కొట్టి......ఇపుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకెలుతున్నాడు. ఆయన నటించిన 'ఆడు మాగాడ్రా బుజ్జి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది.

English summary
Super star Krishna health issue in talk. Superstar Krishna, is an Indian film actor, director and producer known for his works in Telugu Cinema.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu