»   » రంగేసి కడిగేయటం కాదు.. : మహేష్ ఆన్సర్ (పర్యటన ఫొటోలు,విశేషాలు)

రంగేసి కడిగేయటం కాదు.. : మహేష్ ఆన్సర్ (పర్యటన ఫొటోలు,విశేషాలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు మహేష్ బాబు తన మాటను నిలబెట్టుకున్నారు. తన స్వగ్రామం బుర్రిపాలెంను ఆయన సందర్శించటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. దాదాపు రెండు కోట్ల పద్నాలుగు లక్ష్లు విలువ గల పనులకు ఆయన శంకుస్ధాన చేసారు.

' నేను పుట్టిన గ్రామానికి సేవచేసే భాగ్యం కలగటం నా అదృష్టం. గొప్ప అవకాశం కూడా. నా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక నమూనా గ్రామంగా తీర్చిదిద్దుతా... నా మొదటి లక్ష్యం అందరికీ విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావటమే. అభివృద్ది అంటే రంగువేసి కడిగేసినంత తేలిక కాదు. ఆచరణలో చేసి చూపటమే నా ముందున్న కర్తవ్యం' అని మహేష్‌బాబు అన్నారు.

ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని తన స్వగ్రామం బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌బాబు తన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలసి సందర్శించారు. ఈ గ్రామాన్ని ఆయన దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం తర్వాత స్వగ్రామానికి మహేష్‌బాబు రావటంతో గ్రామస్తులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వేల సంఖ్యలో ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు తరలి రావటంతో గ్రామంలోని వీధులు జనంతో కిక్కిరిశాయి.

ఏ వీధి చూసినా ఇసుకేస్తే రాలని విధంగా కిక్కిరిసిన జనం... అందరి సెల్‌కెమేరాల చూపు శ్రీమంతునివైపే... రోడ్లు చాలదన్నట్టు భవంతులు, ఇంటి గోడలు, చెట్లు, విద్యుత్తు స్తంభాలపైకి అభిమానం ఎక్కికూర్చుంది. జయజయధ్వానాలతో గ్రామమంతా మారుమోగింది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామమంతా బ్రహ్మోత్సవ వాతావరణమే.

తెదేపా నాయకుడు చందు సాంబశివరావు, ఆర్డీఓ నరసింహులు, ఎంపీపీ వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యుడు సనకా రామ్మోహన్‌, ఎండీఓ శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రంలో నటిస్తుండగా.. మే 20 న ఈ చిత్రం విడుదల కానుంది.


స్లైడ్ షోలో ఆ ఫొటోలు, మరిన్నివిశేషాలు

సందడే సందడి

సందడే సందడి

హీరో మహేశ్‌బాబు దత్తత తీసుకున్న తర్వాత తొలిసారి బుర్రిపాలెం గ్రామానికి రావడంతో ఆదివారం అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

మూడు గంటలకు

మూడు గంటలకు


మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో కలసి బుర్రిపాలెం చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు నివాసంలోనే మొదట విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

పంపిణీ

పంపిణీ

అనంతరం అక్కడే వివిధ పథకాల కింద లబ్ధిదారులకు పత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు.

అనంతరం....

అనంతరం....

టాపులేని జీపులో ఎంపీ జయదేవ్‌, ఎమ్మెల్యే ఆలపాటి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బాబాయి ఆదిశేషగిరిరావుతో కలసి గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు.

మహేష్ మాట్లాడుతూ...

మహేష్ మాట్లాడుతూ...

' రాజకుమారుడు చిత్రీకరణ సమయంలో బుర్రిపాలెం వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తాను.

అప్పుడే అనుకున్నా కానీ

అప్పుడే అనుకున్నా కానీ

శ్రీమంతుడు చిత్రీకరణ సమయంలో గ్రామాన్ని దత్తత తీసుకుందామని బావ గల్లా జయదేవ్ చెప్పారు. అయితే అలా చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని అందరూ అనుకుంటారు. అందుకే చిత్ర విడుదల తరువాత గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది.

ధాంక్యూ

ధాంక్యూ


మాకు సహాయం చేస్తున్న ఆంధ్రా హాస్ప‌టల్స్ కు మరియు సిద్దార్థ కాలేజి లోని 200 మంది విద్యార్ధులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా'అన్నారు.

హెల్త్ కార్డులు, పట్టాలు

హెల్త్ కార్డులు, పట్టాలు

ఈ సందర్శనలో ఆయన పలువురికి హెల్త్ కార్డులు, ఇళ్ళ స్థలాలకు పట్టాలను అర్హులైన వారికి పంపిణీ చేశారు.

తొలి ప్రాదాన్యం

తొలి ప్రాదాన్యం

తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో వైద్యం, విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తానని మహేశ్‌ ప్రకటించారు.

ఆంధ్రహాస్పటిల్స్ వారు..

ఆంధ్రహాస్పటిల్స్ వారు..

దీనిలో భాగంగానే గ్రామంలో అందరికీ ఉచిత వైద్యసేవలు అందించేందుకు విజయవాడలోని ఆంధ్ర హాస్పటల్స్‌ ఛైర్మన్‌ రమణమూర్తి ముందుకువచ్చారు. గ్రామంలో అందరికీ ఎన్నిసార్లయినా వైద్యం అందించడానికి తాము సిద్ధమని రమణ ప్రకటించారు.

సిద్దార్ద కాలేజి

సిద్దార్ద కాలేజి

విజయవాడ సిద్ధార్థ వైద్యకళాశాల విద్యార్థులు కూడా ఇందులో పాలుపంచుకోనున్నారు.

తొలి కార్టుని

తొలి కార్టుని


మహేశ్‌పేరుపై ప్రత్యేకంగా హెల్త్‌కార్డులను సిద్ధంచేసి, తొలి కార్డును సర్పంచి సామ్రాజ్యంకు అందించారు. గ్రామస్థులందరికి వీటిని అందజేస్తామన్నారు.

వూహలకు తగ్గట్లే

వూహలకు తగ్గట్లే

బుర్రిపాలెం అభివృద్ధి దిశగా తొలి అడుగు వేశామని, భవిష్యత్తులో మహేశ్‌ వూహలకు తగినట్టే నమూనా గ్రామంగా తీర్చిదిద్దే విషయంలో తమవంతు సహకారం అందిస్తామని ఎంపీ గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యే ఆలపాటి పేర్కొన్నారు.

ఓపెన్ టాప్ లో

ఓపెన్ టాప్ లో

గ్రామంలో జయదేవ్‌, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలసి ఓపెన్‌టాప్‌ జీపులో మహేశ్‌బాబు పర్యటించారు.

పైలాన్

పైలాన్

రూ. 2.16 కోట్లతో గ్రామంలో చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు.

దానం చేసిన స్దలంలో

దానం చేసిన స్దలంలో

మహేష్‌బాబు నాయనమ్మ నాగరత్నమ్మ దానం చేసిన స్థలంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

ఓ స్పూర్తి

ఓ స్పూర్తి

శ్రీమంతుడు సినిమా ఒక స్పూర్తి అయితే, జయదేవ్‌ ప్రోత్సాహంతో ఈ గ్రామాలను దత్తతు తీసుకున్నానని మహేష్‌బాబు చెప్పారు.

చాలా ఇష్టం

చాలా ఇష్టం


బుర్రిపాలెం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇకపై గ్రామాన్ని వదిలిపెట్టకుండా తరచూ వస్తూనే ఉంటానన్నారు. అభివృద్ది చేసి తీరతానన్నారు.

సహకారం

సహకారం


గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, ప్రభుత్వ సహకారంతో నెంబర్‌ వన్‌ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.

త్వరలో సందర్శిస్తా

త్వరలో సందర్శిస్తా


బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో దత్తతు తీసుకున్న గ్రామాన్నీ త్వరలో సందర్శిస్తానని, ఇప్పటికే అక్కడికి నమ్రత వెళ్లి వచ్చారని, వచ్చే వారంలో అక్కడికి వెళ్లి వారి ఇబ్బందులు తీర్చుతానన్నారు.

దత్తత గామాల్లో...

దత్తత గామాల్లో...

తొలి ప్రాధాన్యం కింద విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఉంటుందని, బుర్రిపాలెం గ్రామస్తులకు వైద్య సేవలు అందించేందుకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌ యాజమాన్యం ముందుకు రావటం అభినందనీయమన్నారు.

రంగేసి కడిగేయటం కాదు

రంగేసి కడిగేయటం కాదు

ఒక్కసారి వచ్చి వెళ్లిపోతే అభివృద్ది జరుగుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా రెండు గ్రామాలకు తరచూ వస్తూనే ఉంటానని, అభివృద్ది అంటే రంగేసి కడిగేయటం కాదని తన అభిప్రాయం అన్నారు.

అందరూ చూస్తారు

అందరూ చూస్తారు

భవిష్యత్‌లో తాను చేసే అభివృద్దిని అందరూ చూస్తారని బదులిచ్చారు.

ధీటుగా చేస్తాం

ధీటుగా చేస్తాం

ఎంపీ జయదేవ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్‌ విలేజ్‌ స్పూర్తితో తన అత్తగారి గ్రామం అభివృద్ది చెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మా అమ్మ, నాన్న సొంత గ్రామాలను ఇప్పటికే అభివృద్ది చేశామని, బుర్రిపాలెం కూడా వాటికి దీటుగా మారుతుందన్నారు.

English summary
Superstar Mahesh Babu stood by his promise and has visited his hometown Burripalem to launch several development works worth about Rs 2.14 crore on Sunday. If you remember, he adopted the village after his own film Srimanthudu moved him to do something for his place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu