»   » రజినీకాంత్ ఆగిపోతున్నట్టేనా..? దేశాలమధ్య చిచ్చు రగిలేలా ఉంది

రజినీకాంత్ ఆగిపోతున్నట్టేనా..? దేశాలమధ్య చిచ్చు రగిలేలా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీలంకలోని తమిళ నిర్వాసితుల పురోగతి కోసం పనిచేస్తున్న జ్ఞానం ఫౌండేషన్ సంస్థ తాజాగా వారి కోసం 150ఇళ్లను నిర్మించింది. విశేషమేంటంటే ఈ ఇళ్లను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చేతుల మీదుగా అందజేయనున్నారు. లైకా గ్రూప్ చైర్మన్ కరన్ అల్లిరాజా పేరిట ఏర్పాటు జ్ఞానం ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు రూ.22కోట్లతో ఈ ఇళ్లను ఆ సంస్థ నిర్మించింది.2009లో శ్రీలంక అంతర్యుద్దం తర్వాత పలు ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల పున:నిర్మాణం కోసం జ్ఞానం ఫౌండేషన్ సంస్థ కృషి చేస్తూ వస్తోంది.

ఇదే క్రమంలో జప్నాలోని తమిళ నిర్వాసితుల కోసం 150 కొత్త ఇళ్లను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఈ ఇళ్లను సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 9న నిర్వాసితులకు అందజేయనున్నారు. నిర్వాసితులకు కొత్త ఇంటి తాళాలను అందజేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలోను ఆయన పాల్గొనున్నట్లు వార్తలు వచ్చాయి... అయితే ఇప్పుడూ ఈ పర్యటన మీద పెద్దదుమారమే రేగేలా ఉంది.

Superstar's Sri Lanka visit triggers opposition from Tamil outfits

రజినీ పర్యటనపై గుర్రుగా ఉన్న కొన్ని గ్రూపులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వాటికి డీఎండీకే, జీసీకే పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఎల్టీటీఈని శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోసినప్పుడు ఒక్కమాట కూడా మాట్లాడని రజినీకాంత్ ఇప్పుడు పర్యటనకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. చెన్నైతోపాటు జాఫ్నా ప్రాంతంలో కూడా ఈ రెండు పార్టీలు కొందరిని కూడదీసి రజినీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Superstar's Sri Lanka visit triggers opposition from Tamil outfits

శ్రీలంక తమిళుల ఆందోళనతో రజనీకాంత్ తన పర్యటనపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అక్కడ అలా ఉంటే తమిళనాడు నుంచి కూడా రజినీ పర్యటన సరికాదంటూ కొత్త నిరసన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నగరంలో విలేఖరులతో మాట్లాడిన తిరుమావళవన్, లక్షలాది మంది తమిళులను ఊచకోతకు గురి చేసిన శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయన్నారు. కళాకారులు ప్రజలను సంతోషపెట్టే వారుగా ఉండాలని, తమిళులు వ్యతిరేకిస్తున్న శ్రీలంక గడ్డపై తమిళ సూపర్‌స్టార్‌ కాలుమోపరాదని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

English summary
Superstar Rajinikanth's visit to Sri Lanka next month to inaugurate a housing scheme has met with opposition from pro-Tamil outfits here, who cautioned him from getting "involved" in the emotive ethnic issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu