Just In
- 1 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 58 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సూపర్ స్టార్ మోజుపడి, కోట్లు పెట్టి కట్టుకున్న ఇంటిపై కేసు,భారీ ఫైన్ (భవంతి ఫొటోలు)
ముంబయి: ముంబైలో బాంద్రాలో షారుఖ్ నిర్మించుకున్న కలల సౌధం 'మన్నత్' మరోసారి చిక్కుల్లో పడింది. బాలీవుడ్ బాద్‌షా, సూపర్ స్టార్ షారుఖ్‌ఖాన్ భవంతి 'మన్నత్'వివాదం ఇప్పుడిప్పుడే తీరేటట్లు లేదు. ఏ ముహూర్తాన్న ఆయన దాన్ని సొంతం చేసుకున్నారో కానీ ఆ రోజు నుంచీ ఏదో ఒక వివాదంలో కోర్టుకు వెళ్తూనే ఉంది. గతేడాది ఇంటి ముందు షారుక్ ర్యాంపు కట్టించడంతో అది అక్రమ నిర్మాణం అవుతుందని వాచ్‌డాగ్ ఫౌండేషన్ బీఎంసీకి ఫిర్యాదు చేసింది. దాంతో బీఎంసీ ర్యాంప్‌ను తొలగించింది.
ఇప్పుడు ఈ ఫౌండేషన్ షారుఖ్ ఇంటి ముందు ర్యాంప్ కట్టడం అనేది కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్‌ని అతిక్రమించడం అవుతుందని వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం షారుఖ్ ఇంటిని సీజ్ చేయాలని కేసు వేసింది.
ఈ హీరోయిన్ బంగ్లా ముందు షారూఖ్ భవంతి కూడా బలాదూరే(ఫొటోలు)
ఈ కేసు విషయమై 2013 నుంచి పోరాడుతున్నామని 300 ఏళ్ల కాలం నాటి రోడ్డుపై షారుఖ్ అక్రమంగా ర్యాంప్ కట్టించడంతో తమ పనులకు ఇబ్బంది కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ర్యాంప్‌ను తొలగించమని ఫిర్యాదు చేసిన 18 నెలలకు బీఎంసీ దానిని కూల్చివేసిందని ఇందుకోసం షారుఖ్ రూ.1.93 లక్షలు జరిమానా కట్టాలనివాచ్‌డాగ్ ఫౌండేషన్ సభ్యుడు నికోలస్ ఆల్మీడా అన్నారు.
అదీకాకుండా షారుఖ్ అక్రమంగా ర్యాంప్ కట్టించి లీజు రూల్స్ అతిక్రమించాడని అలా చేస్తే లీజు రద్దు చేయాల్సి ఉంటుందని ముంబయి కలెక్టర్ ఇంతకుముందే చెప్పారని ఇప్పుడు షారుఖ్ ఇంటిని కలెక్టర్ సీజ్ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయమై షారుఖ్ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
గతంలోనూ.. 'మన్నత్' పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా, పర్యావరణానికి హానికలించేదిగా ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్ర కోస్టల్ జోన్ అథారిటీ ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును ముంబై కోర్టు కొట్టి వేసింది. దీంతో షారుఖ్ కు ఊరట లభించినట్లయింది. షారుఖ్ తన ఇంటి నిర్మాణంలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని, మున్సిపల్ సంస్థ అనుమతులతోనే ఈ నిర్మాణం జరిగిందని వివరించారు.
షారూఖ్ భవంతిని లోపలకి వెళ్లి చూసినవారు ఓ అద్బుతమే అంటూంటారు. అయితే కొన్ని ఫేక్ ఫొటోలు సైతం నెట్ లో షారూఖ్ భవంతి అని హల్ చల్ చేసాయి. వాటిని, ఒరిజనల్ ఫొటోలును కూడా మీకు ఇక్కడ అందిస్తున్నాం.

చాలా ఆర్టిస్టిక్ గా..
షారూఖ్ హోదాకు తగ్గట్టు ముంబయిలో 2000 వేల కోట్ల రూపాయల ఖరీదైన అత్యంత విలాసవంతమైన నివాసం ‘మన్నత్' కట్టించుకున్నాడు. మొఘల్ చక్రవర్తుల నివాసాన్ని తలపించే ఆ భవంతి ఇంటీరియర్ డిజైనింగ్ ఎంతో ఆర్టిస్టిక్‌గా ఉంటుంది.

లవ్లీ లివింగ్ ఏరియా
విశాలమైన లివింగ్ ఏరియాలో ఫోకల్ పాయింట్, చెరోవైపు ఏర్పాటు చేసిన రెండు వాల్ లైట్ల మధ్య గోడకు బిగించిన ప్రముఖ పెయింటర్ సుబోధ్ గుప్త పెయింటింగ్. షారూఖ్ భార్య గౌరి సుబోధ్ అభిమాని అని తెలుసుకున్న ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఆ పెయింటింగ్‌ను షారూఖ్‌కు బహూకరించటం విశేషం.

ఇదే ఏ రూమో గెస్ చేసారు కదా
షారూఖ్ ఖాన్ బెడ్ రూమ్ ..ఎరుపు రంగులో ..ఎర్రటి బెడ్ తో మెరిసిపోతూంటుంది. వెల్వెట్ ఫ్యాబ్రిక్ తో బెడ్డింగ్ ని ఈ రూమ్ లో తయారు చేసారు. ఈ రూమ్ ని ఒక సారి చూసిన వారు ఎవరూ కళ్లు తిప్పుకోలేరు. రెడ్, గోల్డ్ కాంబినేషన్ లో ఈ బెడ్ రూం రాయిల్ గా సూపర్ గా ఉంది కదూ.

లావిష్ లుక్ తో
వైట్ మార్బల్స్ తో ఇంటిని అద్బుతంగా తీర్చి దిద్దారు. ఈ డ్రాయింగ్ రూమ్ ఇంటికే ఓ కొత్త అందాన్ని తెచ్చి పెట్టింది. మన్నత్ క్రీమీ వైట్ కలర్ తో చక్కగా తయారైంది. క్రిస్టల్ తో తయారైన షాండ్లియర్ తో డ్రాయింగ్ రూమ్ ఎలా మెరిసిపోతోందో చూడండి. లావిష్ లుక్ తెచ్చిపెట్టింది ఈ రూమ్

అవార్డ్ లు,మెమంటోలు కోసం...
ఇంట్లోని విశాలవంతమైన ఓ గోడలో డిజైన్ చేసిన క్యాబినెట్ పూర్తిగా షారూఖ్ అవార్డులు, మొమెంటోల కోసం కేటాయించారు. లివింగ్ రూమ్‌లో గోడకు వేలాడదీసిన ఎమ్.ఎఫ్.హుస్సేన్ గుర్రాల పెయింటింగ్ మొదలుకుని ఇంటీరియర్ కలెక్షన్ అంతా షారూఖ్ భార్య గౌరి విదేశాల నుంచి ఎంపిక చేసినవే!

ఇది అవుట్ సైడ్ లుక్
మన్నత్ ని బయిట సైడ్ నుంచి చూస్తే ఓ రాజుల భవంతి లాగ ఉంటుంది. ఏదో కలలో మనం ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ బిల్డింగ్ ని సొంతం చేసుకోవటం కోసం రకరకాల లీగల్ సమస్యలను షారూఖ్ ఇప్పటిదాకా ఎదుర్కొన్నాడు. ఇంకా ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఇల్లీగల్ కనస్ట్రక్షన్ అంటూ వివాదాలు ఎదుర్కొంటున్నాడు.

షారూఖ్ బార్య ఇలా
తమ భవంతి ముందు షారూఖ్ బార్య గౌరీ ఖాన్ నిలబడి ఉంది. ఆమె ఈ ఇంటి ఇంటీరియర్ మొత్తం డిజైన్ చేసింది. ఈ ఇంట్లో ప్రతీ వస్తువూ ఆమె టేస్ట్ ప్రకారమే రూపొందింది అంటారు. ఆమెకు కళకృతులు అంటే చాలా ఇష్టం. దాంతో ఆమె ఇంటినిండా పెయింటింగ్స్ తో నింపేసింది. అలాగే ఉడ్ తో చేసిన రకరకాల డిజైన్స్ తెప్పించింది.

రక్షణకోసం ప్రత్యేకంగా
ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆరంతస్తుల భవనం మన్నత్‌లో పాలరాతి మెట్లతో కట్టించిన ఎత్తైన ప్లాట్‌ఫామ్స్, ధ్వజ స్థంభాలు, కమాన్లు రాజప్రసాదాన్ని తలపించేలా మనోహరంగా ఉంటాయి. రక్షణ కోసం కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ ఫ్రెంచ్ గ్లాస్ ఉపయోగించారు.

పిల్లలకోసం..
భవంతిలోని రెండు ఫ్లోర్లను ఫిల్మ్ కమర్షియల్స్ షూటింగ్‌ల కోసం కేటాయించారు. డిష్, ఎయిర్‌టెల్ యాడ్స్ ఆ ఫ్లోర్లలోనే షూట్ చేశారు. పిల్లల కోసం కేటాయించిన నాలుగో ఫ్లోర్‌లో టేబుల్ టెన్నిస్, బాక్సింగ్ రింగ్ ఏర్పాటు చేశారు. దాన్లోనే పిల్లల కాలక్షేపం కోసం పెప్సి డిస్పెన్సర్, జ్యూక్‌బాక్స్, పెద్ద హోమ్ థియేటర్ అమర్చారు.

లోపల ఇవి కూడా ఉన్నాయి
ఎన్నో ప్రత్యేకతలతోపాటు మన్నత్‌లో జిమ్, స్విమ్మింగ్‌పూల్, లైబ్రరీ, ఆఫీస్ ఇలా... అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ‘లివ్ లైఫ్ కింగ్ సైజ్' అన్నారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ అలాంటి కింగ్ సైజ్ లైఫ్ స్టయుల్ లీడ్ చేస్తున్నాడంటారు ఈ భవంతిని చూస్తే..చాలా అద్బుతంగా ఉంటుందీ రూమ్ లో..

కళారాధన
ఈ భవంతిలోని మరో గదిలో ఓ క్రమపద్ధతిలో గోడకు అమర్చిన యాంటిక్ క్రిస్టియన్ ఐకనోగ్రాఫిక్స్ షారూఖ్ కళారాధనకు నిదర్శనం. డిజైనర్ సందీప్ ఖోస్లా అసిస్టెన్స్‌తో యూరప్ నుంచి తెప్పించిన ఈ అరుదైన ఎక్స్‌పెన్సివ్ పెయింటింగ్స్ గదికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

లండన్ నుంచి తెప్పించారు
మన్నత్ కోసం లండన్, మిలన్ నుంచి అత్యంత విలాసవంతమైన ఫర్నిచర్ తెప్పించారు. డ్రెస్సింగ్ మిర్రర్ మొదలుకుని మాస్టర్ బెడ్, డైనింగ్ టేబుల్ వరకూ ప్రతి కలప వస్తువూ ప్రత్యేకంగా తయారుచేయించినదే!

ఓ ఫ్యాన్ ఇంటికి వచ్చి మరీ
ఓ రోజు తన అభిమాని ఒకరు సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి.. తన ఇల్లు 'మన్నత్'లోకి చాటుగా ప్రవేశించాడని.. తర్వాత ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి.. స్నానం కూడా చేశాడని.. ఐతే స్విమ్మింగ్ పూల్‌లో చప్పుడవుతుండటం చూసి సెక్యూరిటీ గార్డు అతణ్ని పట్టుకున్నాడని.. ముందు అతణ్ని దొంగగా భావించారని.. తర్వాత గట్టిగా అడిగితే.. 'షారుఖ్ స్నానం చేసే చోట ఒక్కసారైనా నేను కూడా స్నానం చేయాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను' అని చెప్పడంతో అందరం అవాక్కయ్యారని షారుఖ్ వెల్లడించాడు.

షారూఖ్ చేస్తున్న సినిమాలు
రాహుల్ ధొలాకియా దర్శకత్వంలో షారుఖ్ అవినీతిపరుడైన వ్యాపారవేత్తగా నటిస్తున్న చిత్రం 'రాయీస్'. దీన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు ఖరారు చేశారు. అలాగే..ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుఖ్ మరుగుజ్జుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2018 డిసెంబరు 21న క్రిస్‌మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

షారూఖ్ ని పాక్ పొమ్మంటూ..
పాకిస్థాన్ నటులు.. వారికి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్, అమీర్, షారుక్‌లపై విరుచుకుపడ్డారు వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచి. పాక్ నటులు వాళ్ల టాలెంట్‌ను వాళ్ల దేశంలో చూపించాలని, వారిపైన సానుభూతి చూపుతున్న సల్మాన్, అమీర్, షారుక్‌లాంటి స్టార్లు కూడా పాకిస్థాన్‌కే వెళ్లిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. పాకిస్థాన్ నటులకు మద్దతుగా సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. వాళ్లు నటులే కాని టెర్రరిస్టులు కాదని సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.