»   »  అసలు సుప్రీం అంటే ఎవరు?

అసలు సుప్రీం అంటే ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

"బాలు" ఒక క్యాబ్ డ్రైవర్ వెనక నుంచి హారన్ మోగిస్తే హారర్‌ సినిమా చూపించే టైప్‌ అతను. అసలువిశయం ఏమిటంటే బాలు గాడి కారు పేరు "సుప్రీం" ఇక కథంతా సుప్రీమే నడిపిస్తుంది.అసలు బాలూ  అలా ఎందుకు తయారయ్యాడు,సుప్రీం అనే కార్ సంగతేంటీ..? అనే విశయాలు తెలియాలీ అంటే... . "సుప్రీం" చూడాల్సిందే. ధరంతేజ్ ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా ఒక్కో జోనర్‌కు చెందింది. ఇప్పుడు వచ్చిన 'సుప్రీమ్‌' పక్కా కమర్షియల్‌ సినిమా.

"చాలా కొత్త కథ ఇది. మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి వరకు ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. రాశీఖన్నా కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్లు కొత్తగా ఉంటాయి. జనాల్లోకి వెళ్లడానికి కావలసిన అన్ని అంశాలతో సెటిల్డ్‌గా తెరకెక్కించాడు అనిల్‌. క్యాబ్‌ డ్రైవర్‌ అనగానే 'గ్యాంగ్‌లీడర్‌'తో కంపేర్‌ చేస్తున్నారు. కథానుగుణంగా డ్రైవర్‌ పాత్ర పోషించానంతే." అంటూ తన సినిమా గురించి తన మనసు విప్పాడు యంగ్ సుప్రీం హీరో సాయి ధరం తేజ్....

Supreme is the name of Sai Dharam’s taxi.?

తన కెరీర్ తొలినాళ్ళ లో ఒకనటుడిగా ఎంతో శ్రమిస్తే తప్ప అభిమానులనుంచి "సుప్రీం హీరో" అనే ట్యాగ్ తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ ట్యాగ్‌ నాకు నాలుగు సినిమాలతోనే రావడం ఆనందంగా ఉంది. కానీ ఇది ఇండస్ట్రీ నాకు ఇచ్చిన టాగ్ అది ప్రేక్షకుల నుంచి వస్తే మరింత ఆనందిస్తాను.

ప్రేక్షకులే నన్ను సుప్రీం హీరో అని పిలిచినప్పుడు నిజంగా మామయ్య పేరుని నిలబెట్టానని సంతోషిస్తాను'సుప్రీమ్‌' టైటిల్‌తో సినిమా అనగానే కంగారుపడ్డాను. మావయ్య భుజం తట్టి భరోసా ఇచ్చారు. దీనిని ఒత్తిడిగా కాకుండా బాధ్యతగా తీసుకున్నా'' అని సాయిధరమ్‌ తేజ్‌ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఆయన కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం 'సుప్రీమ్‌'. దిల్‌ రాజు సమర్పణలో శిరీశ్ నిర్మించిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది.

English summary
Supreme is actually the name of the taxi that Saidhramtej drives in the film. And the car is a key to the film’s plot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu