»   » చిరంజీవి వైఫ్ ఆసక్తి చూపలేదు కానీ, చూసాక ఏడ్చారట!

చిరంజీవి వైఫ్ ఆసక్తి చూపలేదు కానీ, చూసాక ఏడ్చారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్ హీరోగా తెరకెక్కిన 'గురు' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి

చిరంజీవి

గురు సినిమా చూసి చిరంజీవి కూడా హాట్సాఫ్ చెప్పారట. ఇటీవల ఓ పత్రిక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెంకటేష్ వెల్లడిస్తూ... చిరంజీవిగారు ‘గురు' చూసి హ్యాట్సాఫ్ టు యు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


రిస్క్ తీసుకున్నావన్నారు

రిస్క్ తీసుకున్నావన్నారు

"ఆ లుక్, నాన్న లాంటి వయసు అనే డైలాగ్ ఒప్పుకోవడం... మామూలు విషయం కాదు. చాలా రిస్క్. నువ్వు ఎప్పుడూ రిస్క్ తీసుకుంటావ్ అని చిరంజీవిగారు అన్నారు. ఆయనకు నా చాయిస్ నచ్చింది. హీరోగా నేను తీసుకుంటున్న రిస్క్ ను అభినందించారు' అని వెంకీ చెప్పుకొచ్చారు.


సురేఖ ఏడ్చారు

సురేఖ ఏడ్చారు

దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ...చిరంజీవి గారి వైఫ్ ముందు ఈ సినిమా చూడటానికి పెద్ద గా ఆసక్తి చూపలేదు. బాక్సింగ్ మూవీ కదా, ఏముంటుందిలే అనుకున్నారుట. సినిమా చూసాక ఇది బాక్సింగ్ మూవీ కాదు... మంచి ఎమోషన్ ఉన్న సినిమా అంటూ ఏడ్చారు. ఆమెకు సినిమా ఎంతగానో నచ్చింది అని తెలిపారు.


అభిమానులకు ఎప్పుడో చెప్పా

అభిమానులకు ఎప్పుడో చెప్పా

నా అభిమానులు నా కోసం, నా సినిమా కోసం వచ్చి హడావుడి చేయాలని ఎప్పుడూ కోరుకోను. వాళ్ల కుటుంబంతో గడపాలని కోరుకుంటాను. అది తప్పో ఒప్పో తెలియదు. నేను బాగా పీక్ స్టేజిలో ఉన్నపుడు వాళ్లు చాలా హంగామా చేయాలనుకున్నారు. నేను వద్దని చెప్పేవాన్ని. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడేవారు. అప్పటి నుండి అది అలా కంటిన్యూ అవుతోంది. రికార్డ్స్ గురించి కూడా నేను అంతగా పట్టించుకోను అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.


English summary
The movie’s director Sudha Kongara revealed that celebrity Chiranjeevi’s wife Surekha​ didn’t show any interest to watch Guru initially, saying that it’s a ‘boxing movie’. However, Surekha ended up watching the film and ultimately​ turned pretty emotional, recollecting the heavy-responsibility climax collection.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu