»   » నిఖిల్ నుంచి తప్పుకొని అఖిల్ సినిమా కి వచ్చేసాడు... అఖిల్ మూడో సినిమా కి స్టైలిష్ దర్శకుడు

నిఖిల్ నుంచి తప్పుకొని అఖిల్ సినిమా కి వచ్చేసాడు... అఖిల్ మూడో సినిమా కి స్టైలిష్ దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నట వారసుడిగా నాగచైతన్య ఇప్పటికే బాగానే ఎస్టాబ్లిష్ అయినా.. భారీ అంచనాలతో వెండితెర అరంగేట్రం చేసిన అఖిల్ మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. తొలి సినిమానే వీవీ వినాయక్‌ వంటి డైరెక్టర్ తీసినా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అఖిల్‌కు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. రెండో సినిమాను నాగ్ దగ్గరుండి మరీ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్‌తో సినిమా చేయబోతున్నాడు అఖిల్. రెండో సినిమా ప్రారంభమైనా కాలేదు కానీ.. అప్పుడే మూడో సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఆ సినిమాకు డైరెక్టర్ కన్ఫార్మ్ అయినట్టు వార్తలొచ్చేస్తున్నాయి.

మెగా కాంపౌండ్‌కు రేసుగుర్రం, ధృవ వంటి హిట్‌లను అందించిన సురేందర్ రెడ్డి ఆ సినిమాకు డైరెక్షన్ చేస్తాడట. అక్కినేని కాంపౌండ్ సురేందర్‌రెడ్డిని ఫైనల్ చేసేసిందని టాక్. ముందుగా అనుకున్న ప్రకారం అయితే సురేందర్ రెడ్డి కన్నడ హీరో నిఖిల్ కుమార్ సినిమా చేయాల్సి ఉంది. కర్ణాటక సీయం హెచ్ డీ కుమార స్వామి కొడుకైన నిఖిల్ జాగ్వార అనే సినిమాతో వచ్చి బొక్క బోర్లా పడ్డ సంగతి తెలిసిందే... అయితే అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సురేందర్ రెడ్డి ని నాగార్జున ఇటుపక్కకు లాగాడట

Surender Reddy Direct To Akhil Akkineni

అఖిల్ మొదటి సినిమా వచ్చి చాలాకాలం కావడంతో, ఆయన రెండవ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్లలో .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ సినిమాకి ప్లాన్ చేశారు. ఈ నెల చివరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకునే అవకాశం వుంది. ఈ సినిమా తరువాత అఖిల్ తో తాను ఒక సినిమా చేయనున్నట్టు సురేందర్ రెడ్డి చెప్పాడు. నాగచైతన్య '100% లవ్' చేసిన దగ్గర నుంచి ఆయనతో ఒక సినిమా చేయాలనుకున్నాననీ, కానీ అంతకంటే ముందే అఖిల్ తో చేసే అవకాశం వచ్చిందని అన్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన 'ధ్రువ' విడుదలైన తరువాత, అఖిల్ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ఛాన్స్ వుంది.

అయితే.. కథ ఏంటన్నది మాత్రం సస్పెన్సే. సురేందర్ రెడ్డి స్వతహాగా కథలు రాయడు కాబట్టి.. అది బయటి రచయితల కథే అవుతుందని అంటున్నారు. అదీగాక.. ఆ సినిమాను అఖిల్‌కు మంచి ఫ్రెండ్ అయిన రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడని చెబుతున్నారు. స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డితో సినిమా చేస్తే అఖిల్ కెరీర్ కి ప్లస్ అవుతుందని నాగార్జున భావిస్తున్నాడట. ఈ క్ర‌మంలోనే అఖిల్ మూడో సినిమా ఆల్‌మోస్ట్ సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాను కొణిదెల బ్యాన‌ర్‌పై మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ నిర్మిస్తాడ‌ని టాక్‌. ఈ సినిమా గురించి పూర్తి వివ‌రాలు వ‌చ్చే యేడాది వెల్ల‌డి కానున్నాయి. మరి ఇంత క్రేజీ కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా అఖిల్‌కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో!!

English summary
After Dhruva, Surender Reddy was approached to direct Kannada star Nikhil Kumar, son of Karnataka’s former chief minister H D Kumar Swamy, but the director is now not showing much interest in the project. As per industry talk, Surender might direct Akhil as Nagarjuna personally requested him to do so.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu