»   » బెల్లంకొండ వర్సెస్ గణేష్‌బాబు

బెల్లంకొండ వర్సెస్ గణేష్‌బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ అగ్రహీరోలయిన బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ....అందరి దృష్టిని ఆకర్షించారు నిర్మాతలు సి.కళ్యాన్, సింగనమల రమేష్. సూరి హత్య కేసు, భానుతో లింకులకు సంబంధించి ప్రస్తుతం కోర్టు చిక్కులు ఎదుర్కొంటున్న ఈ నిర్మాతలు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. క్రిమినల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వాళ్లు సినిమా తీస్తామని వచ్చినా....వాళ్లతో చేయడానికి హీరోలు, హీరోయిన్లు ఎవరూ సిద్ధంగా లేరు.

వీళ్ల సంగతి పక్కన పెడితే...ప్రస్తుతం మరో ఇద్దరు నిర్మాతల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. వారిలో ఒకరు బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ అయితే....మరొకరు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న బండ్ల గణేష్ బాబు. ఇద్దరూ పోటీ పడుతూ సినిమాల మీద సినిమాలు తీస్తూ పోటాపోటీగా విడుదల చేస్తున్నారు.

బెల్లకొండ సురేష్ రీసెంట్ గా కాంచన, కందిరీగ సినిమాలతో మంచి సక్సెస్ సాధించాడు. ఆయన చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వెంకటేష్ తో 'గంగా-దిబాడీగార్డ్", నందమూరి బాలకృష్ణ తో 'హరహర మహదేవ" సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. గణేష్ బాబు ఇప్పటికే పవర్ స్టార్ తో 'తీన్ మార్" సినిమా తీయగా....అయనతోనే 'గబ్బర్ సింగ్" కమిటయ్యాడు. మరో వైపు ఎన్టీఆర్ తో రెండు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో ఒకదానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తుండగా, మరొకటి పూరి జగన్నాథ్ డైకెక్షన్ లో రాబోతోంది. మరి వరుస సినిమాలతో దూసుకెలుతున్న ఈ ఇద్దరు నిర్మాతల్లో ఎవరు టాప్ నిలుస్తారో వేచి చూడాల్సిందే.

English summary
Some of the noted producers in Tollywood are currently busy watching DVDs of their previous films and whiling away time. The stage now belongs to only two people- Bellamkonda Suresh and Bandla Ganesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu