For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RC15: రామ్ చరణ్ కోసం కన్నడ, తమిళ స్టార్ హీరోలు.. అందుకోసం భారీగా ఈవెంట్!

  |

  మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవల RRR మూవీతో మాసీవ్ హిట్, ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్.. తన 15వ సినిమా క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీనితెలుగు, తమిళంలేనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో రెండో సారి చెర్రీ జతకట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్ లేదు. అందుకే ఈ మూవీ టైటిల్ లాంచ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకుంటున్నారు మేకర్స్. ఆ వివరాళ్లోకి వెళితే..

  భారీ స్థాయిలో రిలీజ్..

  భారీ స్థాయిలో రిలీజ్..

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఇటీవల నటించిన RRR మూవీ ఎంత పెద్ద హిట్ అయిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య ప్లాప్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టలాని చూస్తున్నాడు చెర్రీ. అందుకోసం కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తె జతకట్టిన విషయం తెలిసిందే. వీళ్లద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం RC15. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా సినిమాగా మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

  అతిథులుగా పాన్ ఇండియా స్టార్స్..

  అతిథులుగా పాన్ ఇండియా స్టార్స్..

  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం RC15 టైటిల్ లాంచ్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారట. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లేదా ముంబైలలో ప్లాన్ చేస్తున్నారని టాక్. అయితే ఈ ఈవెంట్ కోసం పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా స్టార్ లను అతిథులుగా తీసుకొస్తున్నారట. వీరిలో ఇప్పటికే కన్నడ స్టార్ యశ్, అటూ తమిళం, ఇటు తెలుగులో సూపర్ పాపులర్ అండ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ లుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. వీళ్లతోపాటు ఈ సూపర్ ఈవెంట్ లో మరికొంత మంది స్టార్ లు జాయిన్ కానున్నారని కోలీవుడ్ టాక్. ఎవరూ ఊహించని విధంగా ఈ ఈ వెంట్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఫస్ట్ లుక్ పోస్టర్ రాకముందే ఈ మూవీ బిజినెస్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజీగా జరుగుతోందని వినికిడి. ఈ సినిమాను ఓవర్సీస్ లో ఓ సంస్థ రూ. 15 కోట్లు పెట్టి దక్కించుకుందట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారట.

  ఒక్కపాటకే రూ. 8 కోట్లు..

  ఒక్కపాటకే రూ. 8 కోట్లు..

  ఇదిలా ఉంటే RC15 సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను నవంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేయనున్నారు. ఇందుకోసం టీమ్ మొత్తం న్యూజిలాండ్ వెళ్లనుంది. అక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీలపై పాటలను చిత్రీకరించనున్నారట. సుమారు 10 రోజులపాటు ఈ పాట చిత్రీకరణ చేయనున్నారని తెలుస్తోంది. న్యూజిలాండ్ లోని వివిధ ప్రదేశాల్లో ఈ పాటను షూట్ చేయనున్నారు. అయితే ఈ ఒక్కపాట కోసం రూ. 8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే డైరెక్టర్ శంకర్ సినిమాల్లో పాటలు ఎంత లావిష్ గా, రిచ్ గా ఉంటాయో తెలిసిందే.

  English summary
  Kollywood Star Suriya And Kannada Star Yash Coming As Guest To Ram Charan And Director Shankar Combination Movie RC15 Title Launch Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X