»   » ఎస్ 3 ఇంటర్వ్యూ: సూర్య వర్సెస్ ఎడిజీపి సివి.ఆనంద్ (వీడియో)

ఎస్ 3 ఇంటర్వ్యూ: సూర్య వర్సెస్ ఎడిజీపి సివి.ఆనంద్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ సూర్య నటించిన 'ఎస్ 3' చిత్రం ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సినిమాలో సూర్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియల్ లైఫ్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఎడీజీపి సివి ఆనంద్ తో కలిసి సూర్య ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 'ఎస్ 3' సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

గతంలో సింగం, సింగం 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన హ‌రి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్ఫణలో తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Suriya interviews ADGP C V Anand about S3

ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. 'సింగం-3' తెలుగు హక్కులను మల్కాపురం శివకుమార్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగా... తమిళనాడులో ప్రకృతి బీభత్సం, తర్వాత జయలలిత మరణం నేపథ్యంలో సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

English summary
Suriya interviews ADGP C V Anand about S3. S3 is an upcoming 2017 Indian Tamil-language action-masala film written and directed by Hari. A sequel to Singam II and the third film in the Singam franchise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu