»   » అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా హీరోలు స్టార్ హీరో హోదా వచ్చిన తర్వాత జన సమ్మర్ధ ప్రదేశాల్లోకి రావడానికి దాదాపుగా ఇష్ట పడరు. మరి అలాంటిది భార్యకు బైక్ రైడింగ్ నేర్పించడం లాంటి పనులు చేసే అవకాశం అసలు లేనేలేదు. అయితే సౌత్ సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న సూర్య మాత్రం అందుకు భిన్నం.

హీరో సూర్య తన సహ నటి జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భార్యకు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ రైడింగ్ నేర్పించడానికి ఇటీవల ఆయన ఏకంగా రోడ్డెక్కారు. చెన్నైలో తాము నివాసం ఉంటున్న వీధులోనే భార్యకు బైక్ రైడింగ్ నేర్పించారు.

సూర్య లాంటి పెద్ద స్టార్ ఇలా తన భార్య కోసం నడిరోడ్డుపైకి రావడం చూసి అంతా షాకయ్యారు. కొందరు ఆయన వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. జనసంచారం తక్కువగా ఉండే ఉదయం పూట ఆయన ఈ పని పెట్టుకున్నారు.

నువ్వు మాత్రమే చేయగలవు సూర్య

నువ్వు మాత్రమే చేయగలవు సూర్య

ఇలాంటి నువ్వు మాత్రమే చేయగలవు సూర్య... నువ్వు రియల్ హీరో అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బోత్ ఆర్ పెంటాస్టిక్, లవ్లీకపుల్ అంటూ మరికొందరు పొగడ్తలు గుప్పించారు.

సరిగ్గా దశాబ్దం క్రితం

సరిగ్గా దశాబ్దం క్రితం

సరిగ్గా దశాబ్దం క్రితం సూర్య, జ్యోతిక వివాహం జరిగింది. 2006 సెప్టెంబర్ 11న ఇద్దరూ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

తమ లవ్ స్టోరీ గురించి

తమ లవ్ స్టోరీ గురించి

విభిన్న ధృవాలు ఆకర్షించుకున్నట్టే సైలెంట్‌గా ఉండే నేను వాగుడుకాయ జ్యోతిక ప్రేమలో పడ్డాం. ఆమె మాట్లాడుతూ ఉంటే నేను ఎక్కువగా వింటూ అవసరమైనప్పుడు కలగజేసుకుంటూ ఉంటాను. మా ప్రేమ లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కానేకాదు. మేము మొదట మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం. దాంతో మా మధ్య ఏదో ఉందని మీడియా కథనాలు రాసేసింది అని సూర్య ఆ మద్య ఓ పత్రిక ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.

నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావ్ అనేసింది

నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావ్ అనేసింది

అప్పట్లో నాకంటే జ్యోతిక మంచి ఫామ్‌లో ఉండేది. నాకేమో అవకాశాలు తగ్గటంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫిట్‌నెస్‌ మీద ధ్యాస పెట్టాను. జ్యోతికతో మాటలు కూడా తగ్గాయి. దాంతో ఒకరోజు జ్యోతిక నేరుగా నా దగ్గరికొచ్చి ‘నన్నెందుకు అవాయిడ్‌ చేస్తున్నావు?' అని అడిగేసింది. ఆ తర్వాత ఇద్దరం ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అలా నెమ్మదిగా మా స్నేహం కాస్తా ప్రేమగా మారిందని సూర్య గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

జ్యోతిక గురించి సూర్య చెబుతూ...

జ్యోతిక గురించి సూర్య చెబుతూ...

సూర్య తన భార్య జ్యోతికను ముద్దుగా జో అని పిలుస్తుంటారు. జో అద్భుతమైన భార్య, అపురూపమైన తల్లి. సినిమాల్లో టాప్‌ పొజిషన్‌లో ఉండి పెళ్లి చేసుకుని సెటిలైపోవడం చిన్న విషయం కాదు. అయినా జో పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైపోయింది. మాది ఉమ్మడి కుటుంబం. జో పెళ్లైన కొద్ది కాలంలోనే అందరితో కలిసిపోయింది. షూటింగ్‌లతో నేను ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంది అంటూ సూర్య తన భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు.

జ్యోతికవెర్షన్

జ్యోతికవెర్షన్

‘పూవెల్లమ్‌ కెట్టుప్పర్‌' సినిమాలో తొలిసారి కలిసి నటించాం. మొదట్లో స్నేహితులుగానే ఉన్నా క్రమంగా ప్రేమలో పడ్డాం. ఒక మంచి స్నేహితుడైన సూర్య మీద ఎప్పటికీ ఆధారపడవచ్చనిపించేది. అతను ముక్కుసూటి మనిషి. తక్కువ మాట్టాడతాడు. మేము కలిసి నటించినంతకాలం కేవలం స్నేహితులుగానే మెలిగాం. మేము దూరంగా ఉన్నకాలంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది. అతడిని పదే పదే చూడాలనిపించినప్పుడు అతడిని ప్రేమిస్తున్నానని అర్థమైంది. తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. మెసేజ్‌లు నడిచేవి అని జ్యోతిక తెలిపారు.

ఆగటం అనవసరం అనిపించింది

ఆగటం అనవసరం అనిపించింది

ఇక ప్రేమలో పడ్డాక పెళ్లికోసం ఎక్కువ కాలం ఆగటం అనవసరం అనిపించింది. మా ఇద్దరికీ పెళ్లి ఎంతో ముఖ్యమైన విషయం. త్వరగా పెళ్లి చేసుకుని ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టడమే నాకు ముఖ్యమనిపించింది అని సూర్య గురించి జ్యోతిక గతంలో ఓ ఇంటర్వూలో తెలిపారు.

ఆయన చాలా రొమాంటిక్

ఆయన చాలా రొమాంటిక్

సూర్య చాలా రొమాంటిక్‌. సడెన్‌గా సర్‌ప్రైజ్‌ చేయటం ఆయనకిష్టం. హనీమూన్‌కి వెనిస్‌ వెళ్లినప్పుడు అక్కడో అందమైన ఓపల్‌ రింగ్‌ చూశాను. అది నా బర్త్‌ స్టోన్‌ కూడా! అయితే తర్వాత ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. తిరిగొచ్చాక సూర్య చెన్నైలో అలాంటి ఉంగరాన్నే చేయించి నాకు ప్రెజెంట్‌ చేశారని జ్యోతిక ఇంటర్వ్యూలో తెలిపారు.

అసలు జీవితమంతా పెళ్లి తర్వాతే

అసలు జీవితమంతా పెళ్లి తర్వాతే

పెళ్లి తర్వాత జీవితం గురించి ఎక్కువ మంది కంప్లెయింట్‌ చేస్తూ ఉంటారు. కానీ అసలు జీవితమంతా పెళ్లి తర్వాతే మొదలవుతుంది. మాది పర్‌ఫెక్ట్‌ మ్యారేజ్‌. మరిముఖ్యంగా సూర్య కుటుంబ సభ్యులతో నాకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. పెళ్లయ్యాక మేమిద్దరం విడిగా వెళ్లిపోయి ఉంటే ఇంత ఆనందంగా ఉండేవాళ్లం కాదేమో? సూర్య తమ్ముడు కార్తి నాకు మంచి ఫ్రెండ్‌. ఆయన సిస్టర్‌ బృంద కూడా.. అని జ్యోతిక తెలిపారు.

నాకు నేను నచ్చేంత బెటర్‌ పర్సన్‌గా మారాను

నాకు నేను నచ్చేంత బెటర్‌ పర్సన్‌గా మారాను

నా వరకు పెళ్లి మంచి థెరపీలా పని చేసింది. పెళ్లయ్యాకే నాకు నేను నచ్చేంత బెటర్‌ పర్సన్‌గా మారాను. ఎక్కువ మెచ్యూర్‌గా, రెస్పాన్సిబుల్‌గా తయారయ్యాను. పెళ్లికి ముందు సినిమా చుట్టూనే నా ఆలోచనలు తిరిగేవి. ఇప్పుడు నా ఆలోచనా పరిధి విస్తరించింది. నా పిల్లలు, మా ఆయన, అత్తమామల దృష్టిలోంచి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను అని జ్యోతిక చెప్పుకొచ్చారు.

English summary
Suriya teaching Jyothika to ride the royal enfield bike. Jyothika married actor Suriya on 11 September 2006, with whom she was paired in seven films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu